Share News

Narayana Murthy: 4 నెలల మనవడికి ఇన్ఫీ నారాయణ మూర్తి రూ.240 కోట్ల గిఫ్ట్!

ABN , Publish Date - Mar 18 , 2024 | 07:28 PM

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తన 4 నెలల మనవడు ఏకాగ్రకు రూ.240 కోట్లు విలువైన ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు.

Narayana Murthy: 4 నెలల మనవడికి ఇన్ఫీ నారాయణ మూర్తి రూ.240 కోట్ల గిఫ్ట్!

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Infosys Narayana Murthy).. తన 4 నెలల మనవడు ఏకాగ్రకు రూ.240 కోట్లు విలువైన ఇన్ఫోసిస్ షేర్లను (Rs 240 Crore Shares) బహుమతిగా ఇచ్చారు (Gift to Grandson). దీంతో, చిన్నారి నెలల వయసులోనే మిలియనీర్ అయిపోయాడు. నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, ఆయన భార్య అపర్ణా కృష్ణన్ కుమారుడే ఏకాగ్ర రోహన్ మూర్తి (Ekagrah Rohan Murthy).

Viral: ఎదురుగా ఉన్నది పోలీస్.. అదీ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలీక..

తన మనవడికి నారాయణ మూర్తి మొత్తం 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను ఇచ్చారు. ఆఫ్ మార్కెట్‌గా ఈ షేర్ల బదలాయింపు జరిగింది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఇన్ఫోసిస్ సమాచారం అందించింది. తాజా షేర్ల బదలాయింపుతో నారాయణ మూర్తి వాటా 0.40 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఆయన వద్ద 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి.

Viral: ఈ లేడీ డాక్టర్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.. ఈమె సూచనలను తూచాతప్పకుండా పాటిస్తే..


నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తి, ఆమె భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఇద్దరు కూతుళ్లన్న విషయం తెలిసిందే. ఇక రోహన్ మూర్తి కుమారుడు ఏకాగ్ర గతేడాది నవంబర్‌లో జన్మించాడు. మహాభారతంలోని అర్జునుడి స్ఫూర్తితో చిన్నారికి ఏకాగ్ర అని పేరు పెట్టారు. సంస్కృతంలో ఏకాగ్ర అంటే చెక్కుచెదరని ఏకాగ్రత, పట్టుదల అని అర్థం.

Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..

1981లో రూ.10 వేల పెట్టుబడితో నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగిన సంస్థ ప్రస్తుతం భారత్‌లో రెండో అతిపెద్ద టెక్ కంపెనీగా నిలిచింది. నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఓ రచయిత. స్ఫూర్తి కలిగించే అనేక పుస్తకాలను రచించారు. ఇటీవలే ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 07:44 PM