Share News

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!

ABN , Publish Date - Aug 15 , 2024 | 01:00 PM

సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ ఒకేసారి రావడం అరుదుగా జరుగుతుందని అంటున్నారు. సూపర్ బ్లూ మూన్ అనేది రాఖీ పండుగ సందర్బంగా రావడంతో ఈ ఏడాది రాఖీ పండుగకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 1979లో పాశ్చాత్య జ్యోతిష్కుడు రిచర్డ్ నోల్లెచే సూపర్ మూన్ అనే పదాన్ని పరిచయం చేశారు. 2024లో వరుసగా నాలుగు సూపర్ మూల్ లు రానున్నాయి. వాటిలో రాఖీ పండుగ నాడు వచ్చే సూపర్ మూన్ మొదటిది...

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!
Super Blue Moon

ఆగస్టు 19వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి కానుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అదే రోజు ఆకాశంలో ఒక అద్బుత దృశ్యం చోటు చేసుకోనుంది. అదే సూపర్ బ్లూ మూన్.. ఇది సామాన్య ప్రజలనే కాకుండా ఖగోళ శాస్త్రవేత్తలను సైతం ఆకట్టుకుంటుంది. బ్లూ మూన్, సూపర్ మూన్ రెండింటి కలయికగా ఏర్పడనున్న సూపర్ బ్లూ మూన్ గురించి ఆసక్తి విషయాలు తెలుసుకుంటే..

సూపర్ మూన్..

చంద్రుడికి భూమికి 90శాతం దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు సాధారణం కంటే పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దీన్నే సూపర్ మూన్ అని పిలుస్తారు.

బ్లూ మూన్..

నాలుగు పౌర్ణమిలలో మూడవ పౌర్ణమి రోజు బ్లూ మూన్ ఏర్పడుతుంది. ఇది నిజంగా నీలం రంగులో ఉండకపోయినా దీనికి బ్లూ మూన్ అని పేరు ఉంటుంది.

Diabetes Vs Fruits: మీకు మధుమేహం ఉందా? జాగ్రత్త ఈ పండ్లను పొరపాటున కూడా తినకండి..!


సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ ఒకేసారి రావడం అరుదుగా జరుగుతుందని అంటున్నారు. సూపర్ బ్లూ మూన్ అనేది రాఖీ పండుగ సందర్బంగా రావడంతో ఈ ఏడాది రాఖీ పండుగకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 1979లో పాశ్చాత్య జ్యోతిష్కుడు రిచర్డ్ నోల్లెచే సూపర్ మూన్ అనే పదాన్ని పరిచయం చేశారు. 2024లో వరుసగా నాలుగు సూపర్ మూల్ లు రానున్నాయి. వాటిలో రాఖీ పండుగ నాడు వచ్చే సూపర్ మూన్ మొదటిది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో కూడా సూపర్ మూన్ చోటుచేసుకోనుంది.Blue Moon


పౌర్ణమి రోజు 25శాతం సూపర్ మూన్ లు ఏర్పడితే 3శాతం మాత్రమే బ్లూ మూన్ లు ఏర్పడుతుంటాయట. ఇక ఈ రెండింటి కలయిక చాలా అరుదుగా వస్తుందట. ఈ రాఖీ పండుగ తరువాత మళ్ళీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండింటి కలయికలో పౌర్ణమి 2037 సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. NASA ప్రకారం అప్పుడప్పుడు పొగ లేదా ధూళి వంటి చిన్న చిన్న కణాలు కాంతి ఎరుపు తరంగ దైర్ఘ్యాలను చెదరగొడుతుంటాయి. దీని వలన చంద్రుడు నీలం రంగులో కనిపిస్తుంటాడట.Rakshabandhan


ఇవి కూడా చదవండి:

Roasted Chickpeas: వేయించిన శనగల పొట్టు తీసి తింటే బెస్టా? పొట్టు తీయకుండా తింటే బెటరా?

Treadmill: ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసి చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 15 , 2024 | 01:30 PM