Share News

Viral Video: అరే.. మరీ విచిత్రంగా ఉందే.. దూసుకెళ్తున్న లారీ.. ఇంజిన్‌లో చూడగా ఫ్యూజులు ఎగిరే సీన్..

ABN , Publish Date - Aug 10 , 2024 | 01:52 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ హైవే రోడ్డుపై రాత్రివేళ షాకింగ్ దృశ్యం కనిపించింది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ మిగతా వాహనాలతో పాటూ దూసుకెళ్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా..

Viral Video: అరే.. మరీ విచిత్రంగా ఉందే.. దూసుకెళ్తున్న లారీ.. ఇంజిన్‌లో చూడగా ఫ్యూజులు ఎగిరే సీన్..

వాహనాల డ్రైవింగ్ సమయంలో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసధారణమైపోయింది. లారీ తోలుతూ స్నానం చేసే డ్రైవర్‌ను చూశాం, డ్రైవర్ బస్సు నడుపుతుండగా కండక్టర్ గేరు వేయడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఖంగుతింటున్నారు. రోడ్డుపై ఓ లారీ వేగంగా వెళ్తోంది. అయితే ఇంజిన్‌లో చూడగా.. ఫ్యూజులు ఎగిరిపోయే సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ హైవే రోడ్డుపై రాత్రివేళ షాకింగ్ దృశ్యం కనిపించింది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ మిగతా వాహనాలతో పాటూ దూసుకెళ్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది.

Viral Video: రైల్లో ఇలాంటి పని ఇంతవరకూ ఎవరూ చేయలేదేమో.. డోరు వద్ద ఇతడు చేస్తున్న పని చూస్తే..


లారీకి ముందు వైపు వాహనంలో ఉన్న వారు అనుకోకుండా వెనుక వస్తున్న లారీ వైపు చూశారు. లారీ ఇంజిన్‌లో గమనించగా.. ఫ్యూజులు ఎగిరిపోయే సీన్ కనిపించింది. డ్రైవింగ్ సీటులో ఎవరూలేకపోవడం (lorry running without driver) చూసి వారు షాక్ అయ్యారు. డ్రైవింగ్ సీటు వెనుక వైపు ఓ వ్యక్తి తాపీగా పడుకుని కనిపించాడు.

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..


డ్రైవరే అలా పడుకుని కాళ్లతో స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాడా.. లేక స్టీరింగ్ వద్ద కనపకుండా ఇంకెవరైనా దాక్కున్నారా అనే విషయం అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండియాలో ఇలాంటి వారికి కొదువే లేదు’’.. అంటూ కొందరు, ‘‘డ్రైవర్‌కు మందు ఎక్కువై పడుకున్నాడేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆవునే కదిలించిన చిన్నారి.. ఎదరుగా మైక్ పెట్టగానే.. ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Aug 10 , 2024 | 01:52 PM