Share News

Viral: కెనడాలో చెల్లాచెదురుగా చెత్త బ్యాగులు.. భారతీయులను బాధ్యుల్ని చేస్తూ పరోక్ష విమర్శలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:10 AM

కెనడాలో ఓ ప్రాంతంలో చెత్తబ్యాగులు చెల్లాచెదురుగా పడి ఉండటానికి భారతీయ విద్యార్థుల్ని బాధ్యుల్ని చేస్తూ ఓ వ్యక్తి నెట్టింట పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .

Viral: కెనడాలో చెల్లాచెదురుగా చెత్త బ్యాగులు.. భారతీయులను బాధ్యుల్ని చేస్తూ పరోక్ష విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని సాల్ట్ స్టీ అనే ప్రాంతంలో చెత్తాచెదారం చెల్లాచెదురుగా పడి ఉండటంపై నెట్టింట కలకలం రేగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్టు చేసిన ఓ వ్యక్తి భారతీయుల్ని బాధ్యుల్ని చేస్తూ నిందించడాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో టాక్ ఆఫ్ ది టౌన్‌‌గా మారింది (Viral).

Viral: స్విగ్గీలో రూ.8,32,032లతో ఆర్డర్ పెట్టి సరికొత్త రికార్డు! ఇతడేం కొన్నాడో తెలిస్తే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి తమ చుట్టుపక్కల పరిసరాల్లో చెత్తబ్యాగులు చెల్లాచెదురుగా పడి ఉండటంపై విచారం వ్యక్తం చేస్తూ ఈ వీడియో పోస్టు చేశారు. ఇది తను పుట్టిపెరిగిన ప్రాంతమని, చిన్నప్పుడు ఇలా ఉండేది కాదని వాపోయాడు. ఇక్కడి పరిసరాలు అందంగా ఉండేవని అన్నాడు. ఈ భిన్నత్వం.. జుగుప్సాకరంగా ఉందని పోస్టు కామెంట్చ చేశారు. అయితే, వీడియోపై క్యాప్షన్‌లో మాత్రం దీనికి అంతర్జాతీయ విద్యార్థులు బాధ్యులన్నట్టు రాసుంది. ఈ క్యాప్షన్‌లో భారతీయులను నేరుగా నిందించకున్నా భారత జాతీయ జెండా ఎమోజీని జత చేశారు.

Viral: లిప్‌స్టిక్ పెట్టుకునేందుకు రూ.27 లక్షల బ్యాగు కొనుగోలు

సహజంగానే ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు అతడితో ఏకీభవించగా మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన సాక్ష్యాలు లేకుండా అంతర్జాతీయ విద్యార్థులపై నెపం పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.


‘‘అంతర్జాతీయ విద్యార్థులే దీనికి కారణమని మీకు స్పష్టంగా తెలీదు. కొందరు అయ్యే అవకాశం ఉన్నంత మాత్రానా ఆ విషయాన్ని ఇలా సోషల్ మీడియాలో చెప్పడం సరికాదు. ఎవరైనా ఆహారం కోసం చెత్త బ్యాగులను వెతికి ఉండొచ్చు. రాత్రిళ్లు చలిలో ఇది మరింత కష్టం కాబట్టి వాటిని చెల్లాచెదురుగా పడేసి ఉండొచ్చు. ఇలాంటి దృశ్యాలు నిజంగా బాధాకరమే అయినా ఎవరోఒకరిపై నిందమోపడం సబబు కాదు’’ అని ఓ వ్యక్తి అన్నారు. కొందరేమో అంతర్జాతీయ విద్యార్థుల్ని దేశం నుంచి పంపించేయాలని డిమాండ్ చేశారు. కెనడా అంతటా ఇలాంటి పరిస్థితి నెలకొందని మరికొందరు వాపోయారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Dec 29 , 2024 | 11:10 AM