గుకేష్‌కు ఘన సన్మానం
ABN , Publish Date - Dec 18 , 2024 | 05:08 AM
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించిన గుకేష్‌ను అతని సొంత రాష్ట్రం తమిళనాడు ఘనంగా...
చెన్నై (ఆంధ్రజ్యోతి): ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించిన గుకేష్‌ను అతని సొంత రాష్ట్రం తమిళనాడు ఘనంగా సన్మానించింది. మంగళవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పాల్గొని గుకేష్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా గుకేష్‌కు నజరానాగా రూ. 5 కోట్ల చెక్‌ను సీఎం అందజేశారు.