Anvay Dravid : అన్వయ్ ద్రవిడ్ అజేయ శతకం
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:14 AM
బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (100 నాటౌట్) విజయ్ మర్చంట్ ట్రోఫీలో అజేయ శతకంతో విజృంభించాడు. జార్ఖండ్‌తో శుక్రవారం ఇక్కడ
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (100 నాటౌట్) విజయ్ మర్చంట్ ట్రోఫీలో అజేయ శతకంతో విజృంభించాడు. జార్ఖండ్‌తో శుక్రవారం ఇక్కడ ముగిసిన మూడ్రోజుల మ్యాచ్‌లో కర్ణాటక తరఫున నాలుగో నెంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన అన్వయ్ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఫలితంగా కర్ణాటక 123.3 ఓవర్లలో 441/4 స్కోరుతో చివరిరోజును ముగించింది. అంతకుముందు జార్ఖండ్ 387 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.