Share News

Antim Panghal: రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై మూడేళ్లు నిషేధం ఉత్తమమాటే.. క్లారిటీ ఇచ్చిన ఐవోఏ

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:16 PM

తన అక్రెడిటేషన్ కార్డు ఉపయోగించి తన సోదరిని పారిస్ ఒలింపిక్స్‌ విలేజ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి భారత అథ్లెట్ల బృందాన్ని అపఖ్యాతిపాలు చేసిందని, ఆగ్రహించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అతడిపై మూడేళ్లపాటు నిషేధం విధించిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది.

Antim Panghal: రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై మూడేళ్లు నిషేధం ఉత్తమమాటే.. క్లారిటీ ఇచ్చిన ఐవోఏ
Antim Panghal

న్యూఢిల్లీ: తన అక్రెడిటేషన్ కార్డు ఉపయోగించి తన సోదరిని పారిస్ ఒలింపిక్స్‌ విలేజ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి భారత అథ్లెట్ల బృందాన్ని అపఖ్యాతిపాలు చేసిందని, ఆగ్రహించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అతడిపై మూడేళ్లపాటు నిషేధం విధించిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై వస్తున్న వార్తలను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కొట్టిపారేసింది. మీడియా వార్తలు ఒక్కసారిగా గుప్పమనడంతో ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.


తన అక్రెడిటేషన్ కార్డు ఉపయోగించి తన సోదరిని పారిస్ ఒలింపిక్స్‌ విలేజ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి భారత అథ్లెట్ల బృందాన్ని అపఖ్యాతిపాలు చేసిందంటూ అంతిమ్ పంఘల్‌పై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. భారత బృందానికి అవమానకరమైన ఈ చర్యపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆగ్రహించిందని, మూడేళ్లపాటు ఆమెపై నిషేధం విధించిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కాగా మహిళల 53 కేజీల విభాగంలో బుధవారం జరిగిన బౌట్‌లో పంఘల్ ఓడిపోయి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆమె భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత అధికారికంగా నిర్ణయం నిర్ణయిస్తారని వార్తల సారాంశంగా ఉంది.


ఒలింపిక్స్‌లో పతకం ఆశలు రేపిన అమన్ సెహ్రావత్..

రెజ్లింగ్‌లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు ప్రవేశించాడు. గురువారం రాత్రి 9.45గంటలకు జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన రేయి హిగుచితో తలపడతాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు రెజ్లింగ్‌లో పతకం ఖాయమవుతుంది. సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం కోసం జరిగే పోరులో తలపడాల్సి వస్తుంది. హర్యానకు చెందిన అమన్ సెహ్రావత్ 2023 కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. 2022 ఆసియా క్రీడల్లో 57 కిలోల పురుషుల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరి రెజ్లింగ్‌లో భారత్‌కు పతకంపై ఆశలు సజీవంగా ఉంచాడు.

అమన్ సెహ్రావత్ ప్రీకార్వర్ట్స్‌లో నార్త్ మాసిడోనియాకు చెందిన వ్లాదిమిర్ ఎగోరోవ్‌పై 10-0 తేడాతో విజయం సాధించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సైతం ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో పూర్తి అధిప్యతాన్ని ప్రదర్శించాడు. అమన్ తన రెండు మ్యాచుల్లో ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. దీంతో సునాయసంగా వరుస రెండింటిలో గెలిచి సెమీస్‌కు చేరాడు.

Updated Date - Aug 08 , 2024 | 05:36 PM