Share News

IND W vs AUS W: అమ్మాయిలు ఫెయిల్.. బెండు తీస్తారనుకుంటే భయపడ్డారు

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:47 PM

IND W vs AUS W: పురుషుల జట్టులాగే మహిళల జట్టు కూడా కంగారూల బెండు తీస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ జోరు ముందు ఇండియా విమెన్స్ టీమ్ నిలబడలేకపోయింది.

IND W vs AUS W: అమ్మాయిలు ఫెయిల్.. బెండు తీస్తారనుకుంటే భయపడ్డారు

పురుషుల జట్టులాగే మహిళల జట్టు కూడా కంగారూల బెండు తీస్తారని అభిమానులు అనుకున్నారు. ఆస్ట్రేలియాను వాయించి వదులుతారని ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల సొంతగడ్డపై దిమ్మతిరిగే షాక్ ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. అంతా రివర్స్ అయింది. ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ జోరు ముందు ఇండియా విమెన్స్ టీమ్ నిలబడలేకపోయింది. నిప్పులు చెరిగే బంతులతో ఆతిథ్య జట్టు బౌలర్లు విరుచుకుపడటంతో వన్డే మ్యాచ్ టీ20లా అయిపోయింది. ప్రత్యర్థి బౌలర్ల దెబ్బకు భారత్ 100 పరుగులు కూడా దాటలేకపోయింది. ఒకే ఒక బౌలర్ మన టీమ్ పతాన్ని శాసించింది. ఎవరా బౌలర్? అనేది ఇప్పుడు చూద్దాం..


బ్యాటర్ల క్యూ

ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. అలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే టీమ్‌కు మంచి స్టార్ట్ దొరకలేదు. స్కోరు బోర్డు మీదకు 20 పరుగులు కూడా చేరకముందే ఓపెనర్లు ప్రియా పూనియా (3), స్మృతి మంధాన (8) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్ (19), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ తక్కువ వ్యవధిలో వీళ్లు పెవిలియన్ చేరడంతో టీమ్ పతనం మొదలైంది. రిచా ఘోష్ (14), దీప్తి శర్మ (1), సైమా ఠాకూర్ (4), టిటాస్ సాధు (2) డ్రెస్సింగ్ రూమ్‌కు క్యూ కట్టారు.


పేస్‌తో కూల్చేసింది

సీనియర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (23) మధ్యలో కాసేపు పోరాడింది. అయినా కంగారూ బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. అవతలి ఎండ్‌లో వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్‌కు వెళ్తుండటంతో ఆమె కూడా ఏం చేయలేకపోయింది. సపోర్ట్ లభించి ఉంటే సీన్ వేరేలా ఉండేదేమో. ఆసీస్ బౌలర్లలో స్పీడ్‌స్టర్ మేఘాన్ షట్ 5 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించింది. కట్టుదిట్టమైన పేస్ బౌలింగ్‌తో టీమిండియాను తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వకుండా అడ్డుకుంది. భారత్ సంధించిన 100 పరుగుల ఛేదనకు దిగిన ఆసీస్ ప్రస్తుతం 11.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఉంది. ఆ టీమ్ విజయానికి 38.5 ఓవర్లలో 42 పరుగులు కావాలి. స్పిన్నర్ రేణుకా సింగ్ 3 వికెట్లతో ప్రత్యర్థికి సవాల్ విసురుతోంది. ఆమెకు మిగతా బౌలర్లు సహకరిస్తే ఏదైనా మ్యాజిక్ జరిగే అవకాశం ఉంటుంది.


Also Read:

ఆస్ట్రేలియాతో సెకండ్ టెస్ట్.. రెండు కీలక మార్పులతో బరిలోకి భారత్

13 ఏళ్లకే కోటీశ్వరుడైన వైభవ్ విధ్వంసం.. 76 పరుగులతో అజేయంగా..

నాలుగు గంటలు సాగినా.. ఫలితం తేలలేదు

గులాబీ టెస్ట్‌కు స్పోర్టింగ్‌ వికెట్‌

For More Sports And Telugu News

Updated Date - Dec 05 , 2024 | 01:55 PM