Nitish Reddy-Pawan Kalyan: ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు.. నితీష్‌పై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:03 PM
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ తెలుగు తేజంపై నలువైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా నితీష్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నారు.
IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ తెలుగు తేజంపై నలువైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా గడ్డ మీద స్టార్క్, కమిన్స్, లియాన్, బోలాండ్ లాంటి భీకర బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొని ఈ రేంజ్‌లో చెలరేగడం మామూలు విషయం కాదని అంటున్నారు. డెబ్యూ సిరీస్‌లోనే ఫారెన్ టూర్‌లో ఇంతగా సక్సెస్ అవడం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫెయిలైన చోట అద్వితీయ బ్యాటింగ్‌తో టీమ్‌ను కాపాడటం గ్రేట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నితీష్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్న జాబితాలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా చేరారు. ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదంటూ తెలుగోడి నాక్ మీద ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
ఏం చేశామనేదే ముఖ్యం
‘భారత్‌లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు. కానీ దేశానికి మీరేం చేశారు అనేదే కీలకం. నితీష్.. నువ్వు మన దేశాన్ని గర్వించేలా చేశావ్. ఆస్ట్రేలియా గడ్డ మీద అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన భారతీయుడిగా నువ్వు నిలవడం గొప్ప విషయం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రసిద్ధ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో నువ్వు బాదిన 114 పరుగుల నాక్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాగే ఆడాలి. టీమిండియా తరఫున మరెన్నో వరల్డ్ క్లాస్ రికార్డులను అందుకోవాలి. దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలి. ఇక్కడి యువతకు నువ్వు స్ఫూర్తివంతంగా నిలవాలి. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా మలచుకొని ప్యాషన్‌తో వాళ్లు ఎదిగేలా ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. ఈ సిరీస్‌ను భారత్ గెలుచుకోవాలని కోరుకుంటున్నా’ అని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో పవన్ రాసుకొచ్చారు.
అందరికీ గర్వకారణం
21 ఏళ్ల నితీష్ మెల్‌బోర్న్‌లో ఆడిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్‌తో పాటు ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా ఈ తెలుగోడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అతడ్ని అభినందిస్తూ నిన్నే నెట్టింట పోస్టులు పెట్టారు. రంజీలో ఆంధ్ర టీమ్ తరఫున ఎంతో సక్సెస్ సాధించిన నితీష్.. అండర్-16లోనూ అదరగొట్టాడని చంద్రబాబు గుర్తుచేశారు. అతడు మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలుగు వారి ప్రతిష్టను ప్రపంచ యవనికపై మారుమోగిస్తున్నందుకు నితీష్‌కు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అంశాలతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందన్నారు. అన్ని అడ్డంకులను దాటుకొని దూసుకెళ్తే లైఫ్‌లో ఏదైనా సాధించొచ్చని ఆయన ట్వీట్ చేశారు.
Also Read:
నితీష్ రెడ్డికి అరుదైన గౌరవం.. సచిన్ సరసన తెలుగోడు..
బుమ్రా పగబడితే ఇట్లుంటది.. బెయిల్స్ వెతకడానికి టైమ్ సరిపోదు..
అది ‘బాహుబలి’ ఫోజు కాదు.. సీక్రెట్ రివీల్ చేసిన నితీష్
కపిల్ దేవ్ రికార్డ్ చిత్తు చేసిన బుమ్రా.. మరో ఘనత కూడా..
For More Sports And Telugu News