Virat Kohli: కోహ్లీ ఎలాంటివాడో చెప్పిన ఫుట్‌బాల్ స్టార్.. కామెంట్స్ వైరల్
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:01 PM
గ్రౌండ్ లో కనిపించే కోహ్లీ వేరు తనకు తెలిసిన కోహ్లీ వేరని ఫుట్ బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అన్నాడు. కోహ్లీ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు.
అతడు చాలా జెన్యూన్ గా అనిపిస్తాడు. చాలా సరదాగా ఉంటాడు. ప్రత్యర్థి ఎవరైనా సింగిల్ హ్యాండ్ తో ఎదుర్కొనేంత సత్తా ఉన్నోడు. ఈ 40 ఏళ్ల క్రికెట్ స్టార్ పిచ్‌లో ఉన్నప్పుడు విభిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడని పేర్కొన్నాడు. కోహ్లి సుదీర్ఘమైన కెరీర్, వికెట్ల మధ్య పరుగులను కూడా ఛెత్రి ప్రశంసించాడు.
"గ్రౌండ్‌లో కోహ్లీని చూసినప్పుడు, ఇతరులతో పోలిస్తే అతడిది చాలా భిన్నమైన వ్యక్తిత్వంలా కనిపిస్తుంది. అతని లాంగివిటీ చూడండి. అతను వికెట్ల మధ్య పరుగెత్తే విధానాన్ని చూడండి. అతను తనను తాను అన్వయించుకునే విధానాన్ని చూడండి. ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు. దానిని అతడిలా కాపాడుకునే తీరు కూడా ఎంతో అవసరం. లేదంటే కోహ్లీ ఈ స్థాయికి ఎదిగేవాడు కాదు. స్పోర్ట్స్ కాకుండా ఇతర విషయాల గురించి కూడా మాట్లాడుకోవడం వల్ల తాను కోహ్లీతో మరింత క్లోజ్ అవ్వగలిగినట్టు ఈ భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు పేర్కొన్నాడు.
2024లో ఛెత్రీ భారత జాతీయ జట్టు నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6న కోల్‌కతాలోని ఐకానిక్ సాల్ట్ లేక్ స్టేడియంలో ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కువైట్‌తో చివరి మ్యాచ్ లో పాల్గొన్నాడు. 2011లో అర్జున అవార్డును, 2019లో పద్మశ్రీని అందుకున్నాడు. 2021లో భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవమైన ఖేల్ రత్న అవార్డును పొందిన మొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు అయ్యాడు.