Share News

LSG vs SRH: ఓపెనర్ల ఊచకోత.. లక్నోపై హైదరాబాద్ సంచలన విజయం

ABN , Publish Date - May 08 , 2024 | 10:40 PM

ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే..

LSG vs SRH: ఓపెనర్ల ఊచకోత.. లక్నోపై హైదరాబాద్ సంచలన విజయం

ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Super Giants) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే కేవలం 9.4 ఓవర్లలోనే (167) ఛేధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma) (28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్ (Travis Head) (30 బంతుల్లో 89) వీరబాదుడు బాదడం వల్లే.. సన్‌రైజర్స్ ఈ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయగలిగింది. హైదరాబాద్ ఇంత వేగంగా ఛేజ్ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.


మరీ ఇంత నీచమా.. వివాహేతర సంబంధం కోసం కూతురిని..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55), నికోలస్ పూరన్ (48) మెరుపులు మెరిపించడం వల్లే.. లక్నో ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. ఎస్ఆర్‌హెచ్ 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసి గెలుపొందింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే అభిషేక్, ట్రావిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఎడాపెడా షాట్లతో భారీ బౌండరీలు బాదుతూ.. ముచ్చెమటలు పట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించేశారు.

ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

ఎలాంటి వ్యూహాలు పన్నినా, క్లిష్టతరమైన బంతులు వేసినా.. వాళ్లిద్దరూ ఏమాత్రం తడబడకుండా ఊచకోత కోశారు. బౌలర్లపై కనికరం చూపకుండా విరుచుకుపడ్డారు. పోటాపోటీగా బౌండరీల వర్షం కురిపించారు. అటు లక్నో బౌలర్లు కూడా వారిని కట్టడి చేయలేకపోయారు. వాళ్లు బాదుతున్న బాదుడికి ఒత్తిడికి లోనై.. భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. అందుకే.. ఓపెనర్లిద్దరే పది ఓవర్లలోపు లక్నో లక్ష్యాన్ని ఛేధించేసి, తమ హైదరాబాద్ జట్టుకి రికార్డ్ విజయాన్ని తెచ్చిపెట్టారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 08 , 2024 | 10:40 PM