Share News

Travis Head: సెంచరీ కొట్టినా భారత్‌కు భయపడుతున్న హెడ్.. సుఖం లేకుండా చేశారు

ABN , Publish Date - Dec 13 , 2024 | 08:02 AM

Travis Head: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అడిలైడ్ టెస్ట్‌లో భారీ సెంచరీతో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. కానీ భారత్‌తో మ్యాచ్ అంటే అతడు భయపడుతున్నాడు.

Travis Head: సెంచరీ కొట్టినా భారత్‌కు భయపడుతున్న హెడ్.. సుఖం లేకుండా చేశారు

IND vs AUS: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అడిలైడ్ టెస్ట్‌లో భారీ సెంచరీతో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. మళ్లీ పరుగుల వర్షం కురిపించాలని భావిస్తున్నాడు. బిగ్ ఇన్నింగ్స్‌తో కంగారూలకు మరో విజయాన్ని అందివ్వాలని పట్టుదలతో ఉన్నాడు. సిరీస్ గెలవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోవాలని కసిగా ఉన్నాడు. అయితే అతడి ఆశలు నెరవేరడం కష్టంగానే ఉంది. భారత్‌తో మ్యాచ్ అంటే హెడ్ భయపడుతుండటమే దీనికి కారణం.


వరుస డకౌట్లు

గబ్బా టెస్ట్‌ అంటే వణికిపోతున్నాడు హెడ్. ఆస్ట్రేలియాలోని ఏ గ్రౌండ్‌లో మ్యాచ్ జరిగినా చెలరేగిపోతాడీ చిచ్చరపిడుగు. కానీ గబ్బా అంటే మాత్రం షేక్ అవుతాడు. బ్యాట్‌ను మంత్రదండంలా తిప్పుతూ బౌలర్లను బాదిపారేసే హెడ్.. గబ్బాలో మాత్రం షాట్లు ఆడాలంటే భయపడతాడు. ఆ గ్రౌండ్‌లో అతడి పప్పులు ఉడకడం లేదు. అక్కడ ఆడిన మెజారిటీ మ్యాచుల్లో అతడు ఫెయిల్ అయ్యాడు. లాంగ్ ఫార్మాట్‌లో ఆ వేదికలో ఆడిన గత మూడు ఇన్నింగ్స్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 0 (1), 0 (1), 0 (1) ఇవీ అతడి స్కోర్లు. ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై నిరాశతో క్రీజును వీడటం అలవాటుగా మారింది. ఇదే హెడ్‌ను భయపెడుతోంది.


సవాల్‌కు నిలుస్తాడా..

కొన్ని మైదానాలు ఆటగాళ్లకు అచ్చొస్తాయి. అక్కడ మరింత బెస్ట్ ఇవ్వాలని ప్లేయర్లు ప్రయత్నిస్తుంటారు. అదే కొన్ని గ్రౌండ్స్ వాళ్లకు కఠిన సవాల్ విసురుతూ, ఆడాలంటేనే భయపడేలా చేస్తాయి. లక్ కలసి రాకపోవడం, ఎంత బాగా ఆడాలని ప్రయత్నించినా విఫలమవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకే ఆయా మైదానాల్లో బరిలోకి దిగాలంటేనే ఆటగాళ్లు వెనుకంజ వేస్తారు. ఇప్పుడు హెడ్‌ది కూడా సేమ్ సిచ్యువేషన్. పింక్ బాల్ టెస్ట్‌లో సెంచరీ బాదినా గబ్బాలో ఆడాలంటే అతడు భయపడుతున్నాడు. దానికి తోడు రెండో టెస్ట్‌లో సిరాజ్‌తో వివాదం కారణంగా కొన్ని రోజులు వార్తల్లో నలిగాడు. ఐసీసీ అతడ్ని మందలించింది. ఇన్ని విషయాల మధ్య గబ్బాలో తన లక్‌ను అతడు తిరిగిరాస్తాడేమో చూడాలి.


Also Read:

రోహిత్‌ స్థూలకాయుడు : కలినన్‌

తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి

భారత మహిళలకు జరిమానా

For More Sports And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 08:04 AM