Fencer Nada Hafeez : ఏడు నెలల గర్భంతో బరిలోకి..
ABN , Publish Date - Jul 31 , 2024 | 06:46 AM
ఏడు నెలల గర్భిణి పారిస్ ఒలింపిక్స్‌లో కత్తి చేతబూని పతకం కోసం యుద్ధం చేసింది. ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నడా హఫీజ్ ప్రస్తుతం ఏడు నెలల బిడ్డను కడుపులో మోస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా
ఏడు నెలల గర్భిణి పారిస్ ఒలింపిక్స్‌లో కత్తి చేతబూని పతకం కోసం యుద్ధం చేసింది. ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నడా హఫీజ్ ప్రస్తుతం ఏడు నెలల బిడ్డను కడుపులో మోస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసింది. 26 ఏళ్ల నడా సోమవారం జరిగిన పోటీల్లో అమెరికా ఫెన్సర్ ఎలిజబెత్ టార్టకోవ్స్కిపై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించింది. అయితే ఆ తర్వాతి రౌండ్‌లో పరాజయం పాలైంది. వైద్య విద్యను అభ్యసించిన నడా మాజీ జిమ్నాస్ట్ కూడా. నడా ఇప్పటిదాకా మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంది.