T20 World cup: బంగ్లాదేశ్‌పై ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. వరుస బంతుల్లో వికెట్లు ఎలా తీశాడో చూడండి..
ABN , Publish Date - Jun 21 , 2024 | 10:21 AM
అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచాడు.
అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World cup)లో తొలి హ్యాట్రిక్ (Hat-trick) నమోదైంది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు 2007 ప్రపంచకప్‌లో బ్రెట్‌లీ (Brett Lee) కూడా ఈ ఘనత సాధించాడు. బ్రెట్‌లీ కూడా బంగ్లాదేశ్‌పైనే ఈ ఘనత సాధించడం విశేషం (Australia vs Bangladesh).
ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్‌లలో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా కమిన్స్ స్థానం దక్కించకున్నాడు. కమిన్స్ వరుస బంతుల్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు మహమ్మదుల్లా, మెహదీ హసన్, తౌహిద్ హృదోయ్‌ను పెవిలిన్‌కు పంపించాడు. కమిన్స్ కంటే ముందు టీ20 ప్రపంచకప్‌లలో బ్రెట్ లీ, కర్టిస్ క్యాంఫర్ (ఐర్లాండ్), వనిందు హసరంగ (శ్రీలంక), కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), కార్తిక్ మయప్పన్ (యూఏఈ), జోష్ లిటిల్ (ఐర్లాండ్) హ్యాట్రిక్ వికెట్లు తీశారు.
ఇక, గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. కెప్టెన్ షాంటో (41), తౌహిద్ (40) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం మొదలై తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: విరాట్ కోహ్లీతో ప్రయోగాలు వద్దు.. ముందుంది మొసళ్ల పండగ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..