Ravichandran Ashwin: అశ్విన్.. అవసరమెంత?
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:33 AM
రవిచంద్రన్ అశ్విన్.. భారత్ తరఫున టెస్టుల్లో 536 వికెట్లు తీయడంతో పాటు ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్న అనుభవం అతడిది.
పేలవ ఫామ్‌తో ఇబ్బంది
రవిచంద్రన్ అశ్విన్.. భారత్ తరఫున టెస్టుల్లో 536 వికెట్లు తీయడంతో పాటు ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్న అనుభవం అతడిది. ఆఫ్ స్పిన్నర్‌గానే కాకుండా టెయిలెండర్‌లో బ్యాటింగ్‌కు దిగి విలువైన పరుగులతో ఆకట్టుకున్న నేపథ్యం. కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మాత్రం అతడు జట్టు ప్రణాళికల్లో ఉండడం లేదు. ఎందుకంటే ఇటీవలి ఫామ్‌తో పాటు అక్కడి పరిస్థితులు, జట్టు వ్యూహాల కారణంగా టీమ్ మేనేజ్‌మెంట్ 38 ఏళ్ల అశ్విన్‌కన్నా వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపుతోంది. మరోవైపు పాత రికార్డులను కాకుండా కోచ్ గంభీర్ తమ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాడు. అందుకే న్యూజిలాండ్‌తో సిరీ్‌సలో విశేషంగా రాణించిన సుందర్‌ను వెంటనే ఆసీ్‌సతో తొలి టెస్టుకు ఎంపిక చేశారు. ఈనెల 6 నుంచి అడిలైడ్‌లో జరిగే గులాబీ టెస్టుకు కూడా ఇదే బౌలింగ్ కూర్పుతో వెళ్లే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాలో అశ్విన్ ఉత్తమ బౌలింగ్ (4/55) ప్రదర్శన 2021 అడిలైడ్ టెస్టులోనే వచ్చింది. ‘సెనా’ జట్లుగా పేర్కొనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ర్టేలియాలపైనా అతడికిదే బెస్ట్ కావడం గమనార్హం. ఇక తాజా సిరీ్‌సకు ముందు కివీ్‌సతో జరిగిన మూడు టెస్టుల సిరీ్‌సలో అశ్విన్ తీసింది తొమ్మిది వికెట్లే. ఇందులో రెండు టెస్టులు పూర్తిగా స్పిన్‌కు అనుకూలించినా ప్రభావం చూపలేకపోయాడు. అదీగాకుండా.. ఇప్పటివరకు ‘సెనా’ జట్లపై ఒక్కసారి కూడా ఐదు వికెట్లు తీయలేకపోవడం మైన్‌సగా మారింది. మొత్తంగా 43 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీశాడు. అందుకే అతడికి మిగతా నాలుగు టెస్టుల్లో చాన్స్ లభించడం కష్టమే. అటు జడేజా మాత్రం ఒకసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించగలిగాడు.
అలాగే ఈ జట్లపై ఐదు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ కారణంగా ఇప్పటివరకు టీమిండియా అశ్విన్‌కన్నా జడేజా వైపు మొగ్గుచూపింది. అయితే గత పదేళ్ల కాలంలో ‘సెనా’ జట్లపై ఒక్కసారి మాత్రమే వీరి నుంచి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఫీట్ నమోదు కావడం ఆందోళనపరిచే విషయం. బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ ఇద్దరికన్నా సుందర్ టెక్నికల్‌గానూ అదరగొడుతున్నాడు. కివీ్‌సపైనే కాకుండా పెర్త్ టెస్టులో, వామప్ మ్యాచ్‌లోనూ మెరుగ్గా ఆడాడు. అదీగాకుండా అశ్విన్, పాతికేళ్ల సుందర్ మధ్య వయస్సు అంతరం కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితిల్లో అశ్విన్, జడేజాలకు తుది జట్టులో చోటెక్కడ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవేళ సుందర్‌కు గాయమైనా వికెట్ స్పందనను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరు స్పిన్నర్లు అవసరమనుకున్నా సుందర్‌కు జతగా జడేజాతో వెళ్తారనడంలో సందేహం లేదు.