Share News

Surya Kumar Yadav: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు సమం..!

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:58 PM

టీ-20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. సూపర్-8 మ్యాచ్‌లో సమయోచితంగా ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాటర్లు విఫలమైన వేళ అర్ధశతకం సాధించి ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.

Surya Kumar Yadav: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు సమం..!
Suryakumar Yadav Record

టీ-20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మరోసారి సత్తా చాటాడు. సూపర్-8 మ్యాచ్‌లో సమయోచితంగా ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాటర్లు విఫలమైన వేళ అర్ధశతకం సాధించి ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` (Man of the Match)గా నిలిచాడు. ఈ మెగా టోర్నీ (T20 Worldcup)లో బౌలర్‌ కాకుండా బ్యాటర్ ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అందుకోవడం టీమిండియాకు సంబంధించినంత వరకు ఇదే ప్రథమం. ఈ క్రమంలో సూర్య ఓ ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తో సమానంగా నిలిచాడు (Suryakumar Yadav Record).


మొత్తం 28 బంతులాడి 53 పరుగులు చేసిన సూర్య ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడం అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో సూర్యకు ఇది 15వ సారి. ఇలా 15 సార్లు అంతర్జాతీయ టీ-20 ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డులు ఇప్పటివరకు కోహ్లీ మాత్రమే అందుకున్నాడు. తాజాగా ఆ రికార్డును కోహ్లీ సమం చేశాడు. కాగా 15 ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డులు అందుకోవడానికి 113 ఇన్నింగ్స్‌లు అవసరమైతే, సూర్య కేవలం 61 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనతను సాధించాడు.


మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ``మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఇష్టపడతా. కోహ్లీ అవుట్ అయినపుడు నేను చాలా ఒత్తిడికి గురయ్యా. ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు బబుల్ గమ్‌ను మరింత గట్టిగా నమిలా. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత బ్యాటర్‌కు ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు వచ్చింది. నిజానికి ఈ సారి కూడా ఆ అర్హత బౌలర్లకే ఉంది`` అని సూర్య పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

T20 World cup: బంగ్లాదేశ్‌పై ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. వరుస బంతుల్లో వికెట్లు ఎలా తీశాడో చూడండి..


T20 World Cup: భారత్- కెనడా మ్యాచ్ రద్దవుతుందా.. ఫ్లోరిడాలో వాతావరణం ఎలా ఉందంటే..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 21 , 2024 | 01:03 PM