MS Dhoni: ధోనీని చూసి ఎవడ్రా బాబూ అనుకున్నా.. చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా..
ABN , Publish Date - Sep 15 , 2024 | 09:08 AM
టీమిండియా కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ. ఎంతో మంది ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. అయితే 2004లో జింబాబ్వే, కెన్యా పర్యటనల్లో ధోనీ ఆడిన తీరే అతడు టీమిండియాలోకి ఎంటర్ కావడానికి కారణం.
టీమిండియా కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni). ఎంతో మంది ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. అయితే 2004లో జింబాబ్వే, కెన్యా పర్యటనల్లో ధోనీ ఆడిన తీరే అతడు టీమిండియాలోకి ఎంటర్ కావడానికి కారణం. ఆ సిరీస్‌లో ధోనీతో పాటు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra) ఆడాడు. ఆకాశ్ అప్పటికే సీనియర్. జాతీయ జట్టు తరఫున కూడా ఆడాడు. ఆ సిరీస్‌లో ఆకాశ్‌కు ధోనీ రూమ్మేట్ కూడా. అప్పటి అనుభవాలను తాజాగా ఆకాశ్ పంచుకున్నాడు. ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పాడు.
``2004లో జింబాబ్వే, కెన్యా పర్యటనలకు మేమిద్దరం కలిసి వెళ్లాం. అప్పటికే నేను సీనియర్‌ను. ఆ పర్యటనలకు సన్నాహకంగా బెంగళూరులో నెల రోజుల పాటు క్యాంప్ నిర్వహించారు. అక్కడ హోటల్‌లో నా రూమ్మేట్ ధోనీ. అతడి గురించి అప్పటికి నాకేమీ తెలియదు. అక్కడ నుంచి మా మధ్య పరిచయం పెరిగింది. ``నువ్వు ఎన్ని గంటలకు పడుక్కుంటావు`` అని అడిగితే.. ``నువ్వు పడుక్కోవాలనుకుంటున్నావో అప్పుడు లైట్లు ఆపెయ్`` అన్నాడు. అలాగే ఆహారం విషయంలో కూడా నన్నే ఫాలో అవుతాన్నాడు. ఎప్పుడూ తనపై తను విపరీతమైన నమ్మకంతో ఉండేవాడ``ని ఆకాశ్ చెప్పాడు.
``మేం నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాళ్లం. కానీ, ధోనీ మాత్రం ఎప్పుడూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు కాదు. దినేష్ కార్తీక్‌కు బౌలింగ్ వేస్తూ ఉండేవాడు. అయినా మైదానంలోకి దిగితే మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టేవాడు. ఆ పర్యటనలోనే పాక్ స్టార్ పేసర్ ఇఫ్తికార్ అన్జుమ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లు కూడా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫీల్డర్లను మార్చినా బౌండరీలు మాత్రం కొడుతూనే ఉండేవాడు. ``ఎవడ్రా వీడు.. నెట్స్‌లో అసలు ప్రాక్టీస్ చేయడు. మైదానంలో మాత్రం అదరగొట్టేస్తున్నాడు`` అనుకునే వాడిని. కీపింగ్ కూడా పెద్దగా ప్రాక్టీస్ చేసేవాడు కాదు. కానీ, ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకడు`` అని ఆకాశ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Team India: విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు
Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..