Share News

T20 Worldcup: ఓటమి తప్పదనుకునే దశలో హార్దిక్ ఏం చేశాడో చూడండి.. క్లాసెన్ అవుట్ టర్నింగ్ పాయింట్!

ABN , Publish Date - Jun 30 , 2024 | 07:56 AM

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన టీమిండియా విజేతగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడింది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది.

T20 Worldcup: ఓటమి తప్పదనుకునే దశలో హార్దిక్ ఏం చేశాడో చూడండి.. క్లాసెన్ అవుట్ టర్నింగ్ పాయింట్!
Hardik Pandya

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ (T20 Worldcup Final)లో ఒత్తిడిని జయించిన టీమిండియా విజేతగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడింది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో ఇన్నింగ్స్ గాడి తప్పింది. అప్పటివరకు ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడిన క్లాసెన్ (Heinrich klaasen) అవుట్ కావడం మ్యాచ్‌ను భారత్ వైపు తప్పింది.


హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 17వ ఓవర్ వేసేందుకు వచ్చే సమయానికి మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపే ఉంది. ఆ సమయంలో హార్దిక్ ఆఫ్‌సైడ్ వేసిన బంతిని ఆడిన క్లాసెన్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్లాసెన్ అవుట్ కావడమే దక్షిణాఫ్రికాకు విజయాన్ని దూరం చేసింది. మరోవైపు మిల్లర్ ఉన్నా బుమ్రా, అర్ష్‌దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి సఫారీలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో మ్యాచ్ టీమిండియా వైపు టర్న్ అయింది.


దాదాపు ఓటమి కోరల నుంచి బయటపడి విజయాన్ని సాధించిన టీమిండియా అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ముఖ్యంగా బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ త్రయం దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియాను 7 పరుగుల తేడాతో గెలిపించారు.

Updated Date - Jun 30 , 2024 | 07:58 AM