Share News

Wimbledon : పౌలినీ X క్రెజికోవా

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:36 AM

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం ఏడో సీడ్‌ జాస్మిన్‌ పౌలినీ (ఇటలీ)-31వ సీడ్‌ బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తలపడతారు. గురువారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో (2 గం.7 నిమిషాలు) 31వ సీడ్‌ క్రెజికోవా 3-6, 6-3, 6-4తో నాలుగో సీడ్‌, టైటిల్‌ ఫేవరెట్‌ ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌)కు షాకిచ్చింది.

Wimbledon : పౌలినీ X క్రెజికోవా

మహిళల సింగిల్స్‌ ఫైనల్‌

సెమీస్‌లో వెకిక్‌, రిబకినా పరాజయం

వింబుల్డన్‌

లండన్‌: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం ఏడో సీడ్‌ జాస్మిన్‌ పౌలినీ (ఇటలీ)-31వ సీడ్‌ బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తలపడతారు. గురువారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో (2 గం.7 నిమిషాలు) 31వ సీడ్‌ క్రెజికోవా 3-6, 6-3, 6-4తో నాలుగో సీడ్‌, టైటిల్‌ ఫేవరెట్‌ ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌)కు షాకిచ్చింది. అంతకుముందు హోరాహోరీగా జరిగిన మొదటి సెమీస్‌లో పౌలినీ 2-6, 6-4, 7-6 (8)తో అన్‌సీడెడ్‌ డొనా వెకిక్‌ (క్రొయేషియా)ను చిత్తు చేసింది. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో టైటిల్‌ ఫైట్‌కు చేరడం ద్వారా ఒకే ఏడాది వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్‌ల ఫైౖనల్‌కు చేరిన క్రీడాకారిణిగా జాస్మిన్‌ ఘనత వహించింది. 2015, 16ల్లో సెరెనా విలియమ్స్‌ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌లో టైటిల్‌ పోరుకు దూసుకెళ్లిన మొదటి ప్లేయర్‌గా పౌలినీ నిలిచింది. రెండు గంటలా 51 నిమిషాల పౌలినీ-వెకిక్‌ పోరు వింబుల్డన్‌లో సుదీర్ఘ సమయం సాగిన మహిళల సెమీఫైనల్‌గా రికార్డుల కెక్కింది. తొలి సెట్‌ను కోల్పోయిన పౌలినీ..రెండో సెట్‌లో 4-4తో పరాజయానికి రెండు గేముల దూరంలో ఉండి పుంజుకున్న తీరు అద్భుతం. ఇక మూడో సెట్‌లోనూ జాస్మిన్‌ 1-3, 4-3తో వెనుకంజలో ఉన్నా.. వెనక్కు తగ్గకుండా పోరాడడంతో సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌ కూడా హోరాహోరీగా సాగినా అంతిమంగా పౌలినీదే పైచేయి అయ్యింది. పౌలినీ 26 విన్నర్లే కొట్టగా..వెకిక్‌ 42 విన్నర్లతో విరుచుకుపడింది. అయితే పౌలినీ (32)తో పోల్చితే ఎక్కువగా అనవసర తప్పిదాలు (57) చేసిన వెకిక్‌ మూల్యం చెల్లించుకుంది.

Updated Date - Jul 12 , 2024 | 05:36 AM