Spam Calls: త్వరలోనే స్పామ్ కాల్స్ బంద్.. ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్
ABN , Publish Date - May 15 , 2024 | 08:21 PM
మీ ఫోన్‌కు ప్రతి రోజు పలు రకాల స్పామ్ కాల్స్(spam calls) వస్తున్నాయా. అయితే మీకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఎందుకంటే స్పామ్ కాల్స్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని మరికొన్ని రోజుల్లో అమలు చేయనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మీ ఫోన్‌కు ప్రతి రోజు పలు రకాల స్పామ్ కాల్స్(spam calls) వస్తున్నాయా. అయితే మీకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఎందుకంటే స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (TRAI) సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో మరికొన్ని రోజుల్లో మీ మొబైల్‌కు వచ్చే బ్యాంకింగ్ సహా అనేక ఫ్రాడ్ కాల్‌లపై పూర్తిగా నిషేధం అమలు కానుంది.
ఈ క్రమంలోనే ఇటివల స్పామ్ కాల్స్‌కు సంబంధించి టెలికాం రంగ నియంత్రణ సంస్థ(TRAI) అన్ని మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇలాంటి స్పామ్ కాల్స్‌ను ఆపేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికల ప్రకారం ఈ కమిటీ స్పామ్ కాల్‌లను నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాల ముసాయిదాను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మే 10న సమావేశం కూడా జరిగింది. టెలికాం డిపార్ట్‌మెంట్, ట్రాయ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే, సెల్యులార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బీఎస్‌ఎన్‌ఎల్(BSNL), వొడాఫోన్, రిలయన్స్, ఎయిర్‌టెల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో స్పామ్ కాల్స్ కేటగిరీలో ఏ రకమైన కాల్స్ పెట్టాలనే దానిపై చర్చ జరిగింది. ఇందులో అక్రమ కాల్‌లు, మెసేజ్‌లు వంటి అంశాలపై చర్చించారు. ముసాయిదాను సిద్ధం చేస్తున్నప్పుడు, స్పామ్ కాల్‌లకు సంబంధించి అందిన అన్ని సిఫార్సులను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంది. అంటే కొత్త నిబంధనలపై కూలంకషంగా చర్చించి ముసాయిదా సిద్ధం చేశారు. ఇప్పుడు వినియోగదారుల వ్యవహారాల శాఖ దీనికి తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే కాల్ చేసినప్పుడు నంబర్‌తోపాటు పేరును ప్రదర్శించాలని TRAI ఇటివల అన్ని కంపెనీలను ఆదేశించింది. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ పరికరాలలో వినియోగదారులకు అలాంటి ఫీచర్లను అందించాలని కూడా స్పష్టం చేసింది.
వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని స్పామ్ కాల్స్ చాలా ఇబ్బందిని కలిగిస్తాయని ఈ కమిటీ అంగీకరించింది. దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో TRAI, టెలికాం డిపార్ట్‌మెంట్ స్పా్మ్ కాల్‌లను నియంత్రించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. అయితే మార్కెటింగ్ కంపెనీలు ప్రతిసారీ కొత్త మార్గాన్ని కనుగొంటున్నాయి. అయితే ఈసారి మాత్రం దీనికి సంబంధించి కమిటీ కఠిన నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, బీమా కంపెనీలు, ట్రేడింగ్ కంపెనీలను కూడా డిజిటల్ కాన్సెంట్ అక్విజిషన్ సిస్టమ్ (DCA) అభివృద్ధి చేయాలని ట్రాయ్ ఆదేశించింది. దీని తర్వాత, వారి నంబర్‌కు కాల్‌లు రావాలా వద్దా అని కస్టమర్‌లు స్వయంగా నిర్ణయిస్తారు.
ఇది కూడా చదవండి:
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి
Read Latest Technology News and Telugu News