Share News

Gandipet: గండిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:16 AM

నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేటలో రోడ్డుని ఆనుకుని అక్రమంగా నిర్మించిన 28 దుకాణాలను అధికారులు కూల్చేశారు.

Gandipet: గండిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

  • 28 దుకాణాలను నేలమట్టం చేసిన అధికారులు

నార్సింగ్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేటలో రోడ్డుని ఆనుకుని అక్రమంగా నిర్మించిన 28 దుకాణాలను అధికారులు కూల్చేశారు. శనివారం నార్సింగ్‌ మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో దుకాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు.


అనుమతిలేనందునే ఆయా నిర్మాణాలను కూల్చేశామని.. నిబంధనలు అతిక్రమించినా, అనుమతులు తీసుకోకపోయినా ఇలాంటి చర్యలే ఉంటాయని మునిసిపల్‌ అధికారులు హెచ్చరించారు. కాగా, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా చేపట్టిన కూల్చివేతను సమర్థిస్తూ గండిపేట వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గండిపేట వాక్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.

Updated Date - Aug 25 , 2024 | 04:16 AM