Share News

TS Politics: సీఎం రేవంత్‌పై నోరుపారేసుకున్న బాల్క సుమన్!

ABN , Publish Date - Feb 05 , 2024 | 05:20 PM

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు.

TS Politics: సీఎం రేవంత్‌పై నోరుపారేసుకున్న బాల్క సుమన్!

మంచిర్యాల: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలే గాడని దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామన్నారు.

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి, స్థాయిని బట్టి బాల్క సుమన్ మాట్లాడాలన్నారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారన్నారు. రైతు బంధు కోసం గ‌త ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన రూ.7,700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కి, కాంగ్రెస్ కంట్రాక్ట‌ర్ల‌ జేబుల్లోకి మళ్ళించారని బాల్క సుమన్ ఆరోపించారు.

Updated Date - Feb 05 , 2024 | 05:24 PM