Share News

Bhatti Vikramarka: కులగణనలో తెలంగాణ దేశానికే మోడల్‌

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:21 AM

రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన దేశానికే మోడల్‌గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.

Bhatti Vikramarka: కులగణనలో తెలంగాణ దేశానికే మోడల్‌

  • సామాజికవేత్తలతో సమావేశంలో భట్టి

  • కులగణనపై నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన దేశానికే మోడల్‌గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి చేపట్టనున్న కులగణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక, దిశా నిర్దేశం చేయడానికి మంగళవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.


వీరితో పాటు కుల సంఘాలు, యువజన సంఘాలను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. వీరితో పాటు బీసీ కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ అభిప్రాయాలను ేసకరిస్తామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 56 ఇండ్లు పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని కులగణన సర్వే పూర్తి చేసినట్టు తెలిపారు. న్యాయపర చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ మురళి మనోహర్‌ సూచించారు. రోజుకు ఒక ఎన్యుమరేటర్‌ 15 ఇండ్లు సర్వే చేయడం భారమని, ఆ సంఖ్య ను పదికి కుదించాలని ఆకునూరి మురళి సూచించారు.

Updated Date - Oct 29 , 2024 | 03:21 AM