Share News

CM Revanth Reddy: రేవంత్‌ను కొనేవాడు పుట్టలే

ABN , Publish Date - Jan 06 , 2024 | 06:31 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమురి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరగనుంది. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏబీఎన్ న్యూస్ ఛానల్ స్టూడియోకు వచ్చారు.

 CM Revanth Reddy: రేవంత్‌ను కొనేవాడు పుట్టలే

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమురి రాధాకృష్ణ (RadhaKrishna) బిగ్ డిబేట్ జరగనుంది. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏబీఎన్ న్యూస్ ఛానల్ స్టూడియోకు వచ్చారు. తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. పీసీసీ చీఫ్ అటు నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏ పీసీసీ చీఫ్ సీఎం పదవీ చేపట్టలేదు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పోస్ట్‌ కొన్నారని గతంలో సీనియర్ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు ఆ సమయంలోనే రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తనది ‘ఆవేదన, దు:ఖం అని.. 9 ఏళ్లు ఉగ్గబట్టుకొని కొట్లాడిన.. బిడ్డ పెళ్లి సమయంలో జైలు నుంచి వచ్చి, పోయిన అని ఆవేశంతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిని కొనేవాడు పుట్టలేదు, ఇక పుట్టడు అన్నారు. ఒక్క తరం కాదు.. నాలుగు తరాలు కేసీఆర్‌తో కొట్లాడతాం అని తేల్చిచెప్పారు. గెలవడం, ఓడటం నీకు తెలుసు.. రేవంత్ రెడ్డి అది కాదు.. రేవంత్ అంటే ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసు. 9 ఏళ్లు నిద్రపోని రాత్రుళ్లు తెలుసు. చర్లపల్లి జైలులో రాత్రి.. డిటెన్షన్ సెల్‌లో పడుకున్నప్పుడు దుఖం ఏంటో.. బాధ ఏంటో తెలుసు.. కేటీఆర్ ఫామ్ హౌస్ చూపించినందుకు తనను జైలులో పెట్టారు.. ఆ విషయం మీ మిత్రుడు విశ్వేశ్వర్ రెడ్డిని అడుగు అన్నారు. ఎవరు ఏ పక్షాన ఉన్నారో అందరికీ తెలుసు.. నీ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు రాజేందర్, ప్రశ్నించే గొంతులను అలా చేస్తే నూటికి నూరు శాతం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సహకరించినట్టే అవుతుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు. కాసేపట్లో ఏబీఎన్ న్యూస్ ఛానల్ స్టూడియోలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ (RadhaKrishna) బిగ్ డిబేట్ జరగనుంది. మీరు తప్పక చూడండి. స్టే ట్యూన్ టు ఏబీఎన్ న్యూస్ ఛానల్

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 06 , 2024 | 06:31 PM