Share News

Son: ప్రియుడితో తల్లి, చూసిన కొడుకును ఏం చేసిందంటే

ABN , Publish Date - Sep 25 , 2024 | 06:14 PM

పొట్టకూటి కోసం తండ్రి గల్ఫ్ వెళ్లాడు. కుమారుడితో చక్కగా ఉండాల్సిన భార్య అలా చేయలేదు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో ఉన్న సమయంలో కొడుకు కంటపడింది. ఇంకేముంది..

Son: ప్రియుడితో తల్లి, చూసిన కొడుకును ఏం చేసిందంటే
Mother Killed His Own Son

జగిత్యాల: మంచి అనేది లేకుండా పోయింది. బంధాలు, బంధుత్వం అనే మాట లేదు. పేగు తెంచుకొని పుట్టిన పిల్లలపై మమకారం చూపించడం లేదు కొందరు. తమ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట నిత్యం వెలుగుచూస్తున్నాయి. జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. చేతికొచ్చిన కుమారుడి చావుకు కన్న తల్లి కారణమైంది.


ఏం జరిగిందంటే..

మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో ప్రతాప్ కుటుంబం ఉంటుంది. ఇతనికి భార్య, కుమారుడు ప్రభాస్ ఉన్నాడు. ఉపాధి కోసం ప్రతాప్ దుబాయ్ వెళ్లాడు. అతని భార్య ప్రవర్తన బాగోలేదు. వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది. కుమారుడు ప్రభాస్ ఉనప్పటికీ భయం లేకుండా వ్యవహరించేది. అలా ఓ రోజు ప్రియుడితో కలిసి ఏకాంతంగా ఉంది. అంతలో ఇంట్లోకి వచ్చిన ప్రభాస్.. వారిద్దరిని చూసి గొడవ పడ్డాడు. తల్లి ప్రియుడు మరొకరితో కలిసి ప్రభాస్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత తల్లి కుమారుడిని దూషించిందని తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురయిన ప్రభాస్ పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


తల్లడిల్లిన తండ్రి

కుమారుడు పురుగుల మందు తాగాడని దుబాయ్‌లో ఉన్న తండ్రి ప్రతాప్ తల్లడిల్లి పోయాడు. వెంటనే స్వగ్రామం వచ్చేశాడు. కానీ ఏం లాభం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రభాస్ కన్నుమూశాడు. అతని మృతదేహం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చుట్టుపక్కల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ తల్లిని చితక్కొట్టారు. కొడుకునే హతమార్చిన తల్లి తన ప్రాణాలకు భద్రత లేదని ప్రతాప్ అంటున్నారు. భార్య పేరు మీద ఉన్న ఇల్లు, భూమి తన పేరు మీద రాయాలని భీష్మించుకొని కూర్చొన్నాడు. దాంతో ప్రభాస్ అంత్యక్రియలు ఆలస్యం అయ్యాయి. పెద్ద మనుషుల నచ్చజెప్పడంతో ప్రతాప్ అంగీకరించారు.


విషాదం

ప్రభాస్ మృతితో జగ్గసాగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని తల్లిపై స్థానికులు దాడి చేశారు. గొడవ జరుగుతుందని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రభాస్ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కుమారుడిని భార్య హత్య చేసిందని ప్రతాప్ ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. కేసు విచారణ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 25 , 2024 | 06:14 PM