Lok Sabha polls 2024: అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యర్థి ఆస్తులు ఇవే
ABN , Publish Date - Apr 25 , 2024 | 06:27 PM
హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎంఐఎంకి కంచుకోట. అలాంటి ఎంఐఎం కంచుకోట బద్దలు కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ క్రమంలో ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లత పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎంఐఎంకి కంచుకోట. అలాంటి ఎంఐఎం కంచుకోట బద్దలు కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ క్రమంలో ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లత పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.
Budi Mutyala Naidu: సీఎం ఫ్యామిలీలో సీన్.. డిప్యూటీ సీఎం ఫ్యామిలీలో రీపిట్
ఆ క్రమంలో తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను నామినేషన్‌తో జత పరిచారు. దీంతో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 221.37 కోట్లు అని కొంపెల్ల మాధవి లత స్పష్టం చేశారు. అందులో చరాస్తుల విలువ రూ.165.46 కోట్లు ఉండగా.. స్థిరాస్తుల విలువ రూ.55.92 కోట్లుగా ఉంది. అలాగే అప్పులు రూ. 27.03 కోట్లు ఉందని వెల్లడించారు.
Sunitha Reddy: సోదరా.. బ్యాండేజీతో డ్రామాలొద్దు
వినో బయోటెక్, విరించి లిమిటెడ్‌లో తన పేరిట రూ.8.92 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని వివరించారు. అన్‌లిస్టెడ్ కంపెనీలైన విరా సిస్టమ్స్, పీకేఐ సొల్యూషన్స్, గజ్వేల్ డెవలపర్స్‌లో తన పేరిట రూ.16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ.29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయన్నారు.
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారానికి సునీత..!
అలాగే తమ దంపతులకు 5 కిలోల బంగారం ఉందన్నారు. అయితే వ్యవసాయ భూములు కానీ, వాహనాలు కానీ లేవని ఆమె స్పష్టం చేశారు. ఇక తనపై ఓ క్రిమినల్ కేసు ఉందని గుర్తు చేశారు. తాను పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశానని కొంపెల్ల మాధవి లత వివరించారు. తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల ఆస్తులు కోట్లాది రూపాయిలు ఉండడం గమనార్హం.
Read National News and Telugu News