Share News

Congress: ఆ నియోజకవర్గంలో ‘కాంగ్రెస్’ బాగానే పుంజుకుందిగా..

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:08 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఛీదరణకు గురైన కాంగ్రెస్‌(Congress) పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో 17 రౌండ్ల లెక్కింపు జరగగా 3 రౌండ్లలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధించింది.

Congress: ఆ నియోజకవర్గంలో ‘కాంగ్రెస్’ బాగానే పుంజుకుందిగా..

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఛీదరణకు గురైన కాంగ్రెస్‌(Congress) పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో 17 రౌండ్ల లెక్కింపు జరగగా 3 రౌండ్లలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధించింది. ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender)కు ఈ నియోజకవర్గంలో 41,393 ఓట్లు వచ్చాయి. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆనాడు సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. అంజన్‌కుమార్‌యాదవ్‌కు ఈ నియోజకవర్గంలో 13,510 ఓట్లు వచ్చాయి. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ సి.రోహిణ్‌రెడ్డికి 18,400 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇదికూడా చదవండి: Danam Nagender: మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..


కేవలం ఆరు నెలల వ్యవధిలోనే జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంది. ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌కు 41,393 ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా ఈ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మూడు రౌండ్లలో మెజారిటీ అందించారు. 8వ రౌండ్‌లో దానం నాగేందర్‌కు 4,138 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డికి 2,978 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రౌండ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 1,160 ఓట్ల మెజారిటీ సాధించింది. 9వ రౌండ్‌లో దానం నాగేందర్‌కు 4,153 ఓట్లు రాగా బీజేపీ కంటే 439 ఓట్ల లీడ్‌ సాధించింది. 10వ రౌండ్‌లో దానంకు 3,927 ఓట్లు రాగా బీజేపీపై 645 ఓట్ల మెజారిటీ సాధించింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతోపాటు మైనారిటీలు పూర్తిగా అండగా నిలవడంతో ఈ మెజారిటీ సాధించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 11:13 AM