Dr. Reddy’s: సీఎంఆర్‌ఎ్‌ఫకు డాక్టర్ రెడ్డీస్ 5కోట్ల విరాళం
ABN , Publish Date - Sep 14 , 2024 | 04:45 AM
వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి విరాళాల వెల్లువ కొనసాగుతోంది.
ఏఎంఆర్ ఇండియా, వెస్ట్రన్ నిర్మాణ సంస్థ కోటి చొప్పున
నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు
సీఎంకు చెక్కు అందజేసిన ఆయన కుమార్తె తేజస్విని
వోక్సెన్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ప్రవీణ్ రూ.50లక్షలు
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, పలు కంపెనీలు సీఎంఆర్‌ఎ్‌ఫకు తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నాయి. శుక్రవారం పలువురు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంతోపాటు సచివాలయంలో కలిసి చెక్కులు అందజేశారు. సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ వరద బాధితులకు ఇటీవల తనవంతు సాయంగా రూ.50లక్షలు ప్రకటించారు.
ఈమేరకు రూ.50లక్షల చెక్కును శుక్రవారం బాలకృష్ణ కుమార్తె తేజస్విని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అందజేశారు. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణరెడ్డి రూ.5 కోట్ల విరాళం సీఎంకు అందించారు. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ రూ.కోటి, వోక్సెన్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ప్రవీణ్ రూ.50లక్షలు, వెస్ట్రన్ నిర్మాణ సంస్థ తరపున సుదర్శన్‌రెడ్డి, సంజయ్‌రెడ్డిలు రూ.కోటి విరాళం సీఎంకు అందజేశారు. మొత్తంగా శుక్రవారం రూ.8 కోట్లు సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా వచ్చాయి.