Share News

Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Nov 08 , 2024 | 05:47 PM

డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికన ఓ విదేశీ మహిళకు ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమెకు 13 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ హెరాయిన్ విలువ రూ. 25 కోట్లకు పైనే ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్, నవంబర్ 08: డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఓ విదేశీ మహిళకు 13 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. అలాగే ఆమెకు రూ. లక్ష జరిమానా సైతం విధించింది. 2021 జూన్‌లో ఉగాండాకు చెందిన ఓ మహిళ హరారే నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో భద్రతా చర్యల్లో భాగంగా ఆమెను సిబ్బంది తనిఖీ చేశారు. ఆ క్రమంలో ఆమె వద్ద భారీగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.

Also Read: రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్.. అనంతరం కోర్టులో..?


అనంతరం ఆ డ్రగ్స్‌ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై ఎన్‌డీపీఎస్ 1985 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీంతో దాదాపు మూడున్నరేళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. అందులోభాగంగా ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శుక్రవారం ఈ కేసులో తుది తీర్పు వెలువరించారు. దీంతో ఆమెకు కఠిన జైలు శిక్షతోపాటు జరిమానా సైతం విధించారు.

Also Read: కమలా పండు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ఆఫ్రికా దేశమైన ఉగాండాకు చెందిన సదరు మహిళ వద్ద 3.9 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పట్టుబడిన డ్రగ్స్.. హెరాయిన్ విలువ రూ. 25 కో్ట్లకు పైనే ఉంటుందని డీఆర్ఐ అధికారులు వివరించారు.


మరోవైపు గత ప్రభుత్వ హయాంలోనే కాదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో సైతం హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఎక్కడో అక్కడ డ్రగ్స్ పట్టుబడుతుంది. అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు పబ్‌లపై పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పబ్‌ల్లో వారి నుంచి భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఈ సందర్బంగా పబ్‌లతోపాటు పట్టుబడిన వారిపై కేసులు సైతం పోలీసులు నమోదు చేస్తున్నారు. అయినా.. డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఎక్కడ ఆగడం లేదు. అంతేకాదు ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక వివిధ రాజకీయ పార్టీల నేతల హస్తం ఉందంటూ ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వేళ.. డ్రగ్స్ పట్టుబడితే కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వం చట్టాలకు పదను పెట్టాలంటూ ప్రభుత్వానికి ప్రజలు సూచిస్తున్నారు.


ఇక హైదరాబాద్ నగరంలో పోలీసులు తనిఖీల్లో విదేశీయుల వద్ద నుంచి భారీగా డ్రగ్స్ లభ్యమవుతున్నాయి. ఈ సందర్బంగా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఈ కేసుల్లో వారికి ఎలాంటి శిక్షలు విధించారనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. కానీ రంగారెడ్డి కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పుతో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న వారిలో గుబులు రేపుతుందని నగర వాసులు పేర్కొంటున్నారు. ఇటువంటి కఠిన శిక్షలు అమలు అయితేనే కానీ.. డ్రగ్స్ వినియోగానికి పుల్ స్టాప్ పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 05:47 PM