GHMC: ఖాళీ స్థలాల సరిహద్దులకు డిజిలైట్.. జియో ఫెన్సింగ్
ABN , Publish Date - Dec 19 , 2024 | 10:03 AM
కాలనీ లే అవుట్‌లలోని అన్ని పార్కులు, ఖాళీ స్థలాల సరిహద్దులను చీఫ్ సిటీ ప్లానర్ టౌన్ ప్లానింగ్ విభాగం సమన్వయంతో డిజిలైట్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) అధికారులను ఆదేశించారు.
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది
హైదరాబాద్ సిటీ: కాలనీ లే అవుట్‌లలోని అన్ని పార్కులు, ఖాళీ స్థలాల సరిహద్దులను చీఫ్ సిటీ ప్లానర్ టౌన్ ప్లానింగ్ విభాగం సమన్వయంతో డిజిలైట్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయంలో బుధవారం అడిషనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్లతో కలిసి కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాలనీ లేఅవుట్లలోని అన్ని పార్కులు, ఖాళీస్థలాల సరిహద్దులను డిజిలైట్‌చేసి జియో ఫెన్సింగ్(Geo-fencing) చేయాలన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ తారుమారు..
ప్రతి ట్రీ పార్కులకు, ఖాళీస్థలాలకు ప్రత్యేకఐడీ ఇవ్వాలని తెలిపారు. 2000 చదరపు గజాల కంటే ఎక్కువ ఖాళీ ప్రదేశాలను పార్కులుగా అభివృద్ధి చేయాలన్నారు. ఏదైనా ఉల్లంఘనలు గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని సర్కిల్‌మేనేజర్లు, ఫీల్డ్, టెక్నికల్, హార్టికల్చర్ అసిస్టెంట్లు తమ పరిధిలోని పార్కులను కనీసం నెలకోసారి సందర్శించి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
ఈ నివేదికను ప్రతినెలా 5వ తేదీలోపు అర్బన్ బయోడైవర్సిటీ అదనపు కమిషనర్‌కు సమర్పించాలన్నారు. పార్క్ నిర్వహణ గురించి వాకర్స్, స్టేక్ హోల్డర్స్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కాంట్రాక్టర్ల చెల్లింపుల విడుదలకు ఉపయోగపడుతుందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News