Share News

బీఆర్‌ఎస్‌ నాయకులను ఎలా చేర్చుకుంటారు?

ABN , Publish Date - Mar 05 , 2024 | 11:31 PM

‘కాంగ్రెస్‌ పార్టీకి ఏళ్లుగా సేవ చేస్తూ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌లో వీర్లపల్లి శంకర్‌ గెలుపు కోసం రాత్రింబవళ్లు కృషి చేశాం. మాకు సమాచారం ఇవ్వకుండా కొందరు కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాంగ్రె్‌సలో చేర్పించేందుకు సిద్ధమయ్యారు.’

బీఆర్‌ఎస్‌ నాయకులను ఎలా చేర్చుకుంటారు?
ఆందోళనకారులకు నచ్చజెబుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి

- నేతల ముందు కాంగ్రెస్‌ శ్రేణుల ధ్వజం

- కుర్చీలు విరగ్గొట్టి నిరసన

- పెట్రోల్‌ పోసుకునేందుకు కార్యకర్త యత్నం

- సముదాయించిన మాజీ ఎమ్మెల్యే

- కొత్తూర్‌ మండలంలో ఘటన

కొత్తూర్‌, మార్చి 5: ‘కాంగ్రెస్‌ పార్టీకి ఏళ్లుగా సేవ చేస్తూ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌లో వీర్లపల్లి శంకర్‌ గెలుపు కోసం రాత్రింబవళ్లు కృషి చేశాం. మాకు సమాచారం ఇవ్వకుండా కొందరు కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాంగ్రె్‌సలో చేర్పించేందుకు సిద్ధమయ్యారు.’ అని కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు దిగి కుర్చీలు విరగ్గొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన మంగళవారం కొత్తూరు మండలంలో చోటుచేసుకుంది. ఇన్ముల్‌నర్వ, మల్లాపూర్‌, గుడూరు, కొడిచర్ల గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్‌ నాయకులు ఇటీవల చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తూరులోని కాంగ్రెస్‌ కార్యాలయంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరే కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. అయితే, కొన్ని అనివార్య ఈ కార్యక్రమానికి కారణాలతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ హాజరు కాలేదు. బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రె్‌సలో చేరుతున్న విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ నాయకులను కాంగ్రె్‌సలో ఎలా చేర్చుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల నాయకులను నిలదీశారు. హాలులో ఉన్న కుర్చీలను విరగ్గొట్టారు. ఓ కార్యకర్త ఆవేశంతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకునేందుకు యత్నించగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. పార్టీకి ఎంతో సేవ చేస్తున్న తమను కాదని బీఆర్‌ఎ్‌సలోని వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఏళ్లుగా ఎన్నో బాధలు అనుభవించి నియోజకవర్గంలో పార్టీని గెలిపిస్తే తమకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని మండల నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, జె.గోవర్ధన్‌గౌడ్‌, జె.సుదర్శన్‌గౌడ్‌, రవికుమార్‌గుప్తా, శ్రీను తదితరులు ఆందోళనకారులకు సర్దిచెప్పి పంపించేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలను వాయిదా వేస్తున్నట్లు నాయకులు ప్రకంటించారు.

Updated Date - Mar 05 , 2024 | 11:31 PM