Share News

Hyderabad: మాదాపూర్‌లో 7.8 మి.మీ వర్షం..

ABN , Publish Date - Jul 07 , 2024 | 10:04 AM

నగరంలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Hyderabad: మాదాపూర్‌లో 7.8 మి.మీ వర్షం..

- నగరంలో మోస్తరు వాన

- ఆదివారం గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్‌(Madapur)లోని కావూరిహిల్స్‌ వద్ద అత్యధికంగా 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోరబండలో 6.5, ఎంసీహెచ్‌ఆర్‌డీలో 6.3, ఫతేనగర్‌లో 5.5, బాలానగర్‌, యూసు్‌ఫగూడలో 5.3, మూసాపేటలో 4.8 మిల్లీమీటర్లు కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ట్యాంక్‌బండ్‌, టోలిచౌకీ, మెహిదీపట్నం, జేఎన్‌టీయూ మార్గాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇదికూడా చదవండి: Bandi Sanjay: కాంగ్రెస్‌కు దమ్ముంటే.. ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలకు వెళ్లాలి


మరో రెండు రోజులు వర్ష సూచన

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌(Hyderabad, Rangareddy, Medchal) జిల్లాలో మరో రెండు రోజులు సాయంత్రం, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 10:04 AM