Hyderabad: టీఎన్జీఓ కాలనీలో రేవ్‌పార్టీ..
ABN , Publish Date - Sep 12 , 2024 | 11:44 AM
గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ(Gachibowli TNGO Colony)లో రేవ్‌పార్టీ సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టీఎన్జీవో కాలనీ అలయ్‌బలయ్ చౌరస్తా పక్కన ఉన్న ఓ ఇంట్లో యువతీ యువకులు పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు.
- పోలీసుల అదుపులో 18 మంది
హైదరాబాద్: గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ(Gachibowli TNGO Colony)లో రేవ్‌పార్టీ సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టీఎన్జీవో కాలనీ అలయ్‌బలయ్ చౌరస్తా పక్కన ఉన్న ఓ ఇంట్లో యువతీ యువకులు పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police) కాలనీలోని ప్లాట్ నెంబర్ 93లోని ఇంటిపై దాడి చేశారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న కె. ఆదిత్య, పిన్నింటి రామకృష్ణ, పెద్దరెడ్డి గారి చరణ్, గొర్తి సాయి ప్రవీణ్, వీరపనేని వరుణ్, శివశంకర్‌రెడ్డి, వీర శివారెడ్డి, మద్దినేని హరికృష్ణ, కాటేపల్లి రమేష్, మండపూడి కోటేశ్వరరావు, అనపర్తి విజయ్‌కుమార్, కోట్ల అజయ్, డి. సంధ్య, కూకటి ఆశ, కూకటి రీతు, షేక్ సమ సుల్తానా, ఎం. కీర్తి, యశోధలను అదుపులోకి తీసుకున్నారు.
ఇదికూడా చదవండి: BJP: నేడు బీజేఎల్పీ సమావేశం.. పార్టీలో గుర్తింపు దక్కడం లేదంటున్న నేతలు
వారి నుంచి 40 గ్రాముల గంజాయి, పలు రకాల మద్యం బాటిళ్లు, 11 హుక్కా వినియోగించే పాట్స్, ఆరు ఓసీబీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరపనేని వరుణ్ ధూల్‌పేట్ నుంచి 50 గ్రాముల గంజాయి కొని తెచ్చినట్లు తెలిసింది. ఆదిత్య అతని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఇంట్లో అద్దెకు ఉంటూ ఈ పార్టీ నిర్వహించినట్లు నిందితులు తెలిపారు. వారిలో ఇద్దరు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. కాగా, పరీక్షలో కె.ఆదిత్య, వీరపనేని వరుణ్, గొర్తి సాయి ప్రవీణ్ గంజాయి తీసుకున్నట్లు తేలడంతో వారిపై ఎన్‌డీపీఎ్‌స యాక్టు కింద కేసు నమోదు చేసి, మిగతా వారిపై న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
...............................................................
ఈ వార్తను కూడా చదవండి
...............................................................
Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!
- దసరా, దీపావళి ప్రయాణాలకు సీట్లు, బెర్తులు ఫుల్
- ప్రధాన రైళ్లలో ఏసీ తరగతులకు ‘నోరూమ్’
- స్లీపర్ క్లాస్‌లో 100కు పైనే వెయిటింగ్ లిస్ట్
- ఏపీ వెళ్లే ప్రయాణికులకు పాట్లే
- ప్రత్యేక రైళ్లపైనే ఆశలు
హైదరాబాద్ సిటీ: పండుగకు ఎప్పుడు వస్తున్నావ్ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి పరిస్థితి ఇది. ఆయా పండుగలకు ఇంకా చాలా రోజులు ఉన్నా.. అక్టోబరు నెలలో హైదరాబాద్ నుంచి బయలుదేరే ముఖ్యమైన రైళ్లలో బెర్తులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ఈ ఏడాది అక్టోబరు 12న దసరా పండుగ కాగా, నవంబరు 1న దీపావళి ఉంది. ఆయా పండగల సందర్భంగా నగరవాసులు పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు వెళుతుంటారు.
అయితే, హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి(Vijayawada, Visakhapatnam, Tirupati)తోపాటు కోల్‌కతా, భువనేశ్వర్, గోరఖ్‌పూర్, జైపూర్, అహ్మదాబాద్ నగరాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోయాయి. హౌరా వైపు వెళ్లే ఈస్ట్‌కోస్ట్, ఫలక్‌నుమా వంటి రైళ్లతోపాటు వందేభారత్ రైళ్లలోనూ సీటు దొరికే పరిస్థితి లేదు. పండుగ తేదీలకు వారం రోజుల ముందు నుంచే దాదాపు అన్నిరైళ్లలో రిజర్వేషన్ ‘నోరూమ్’ స్టేటస్ కనిపిస్తుంది. కోణార్క్, జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్, ఫలక్‌నుమా, గోదావరి, దురంతో, గరీబ్‌రథ్(East Coast, Falaknuma, Godavari, Durantho, Garibrath), విశాఖ, కృష్ణా, శబరి, నారాయణాద్రి, వెంకటాద్రి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్‌క్లాస్, సెకండ్‌క్లాస్ రిజర్వేషన్లో 100కు పైగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది.
ఏసీ తరగతుల్లోనైతే రిగ్రెట్(నోరూమ్) స్టేటస్ దర్శనమిస్తోంది. దీంతో దూర ప్రాంత ప్రయాణికులు ప్రత్యేక రైళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. పండగ రద్దీ దృష్ట్యా అక్టోబరులో 400కు పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతామని రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ప్రత్యేక రైళ్లను ఉత్తరాది రాష్ట్రాల వైపే అధికంగా కేటాయిస్తున్నారని ప్రయాణికుల నుంచి ఆరోపణలున్నాయి. చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం రూట్లలోనూ ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్లు ఉన్నాయి.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News