Share News

Hyderabad : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

ABN , Publish Date - Sep 18 , 2024 | 03:38 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్‌ జిష్టుదేవ్‌వర్మ ఆమోదం తెలిపారు.

Hyderabad : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

  • విజిలెన్స్‌ కమిషనర్‌గా ఎంజీ గోపాల్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్‌ జిష్టుదేవ్‌వర్మ ఆమోదం తెలిపారు. ఆమెను కమిషనర్‌గా నియమిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాణి కుముదిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నుంచి లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎల్‌ఈటీఎఫ్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వరకు పలు హోదాల్లో పనిచేశారు. 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8న ముగిసింది.

Updated Date - Sep 18 , 2024 | 03:38 AM