Hyderabad: థాంక్యూ సీఎం సార్..
ABN , Publish Date - Aug 03 , 2024 | 10:37 AM
సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు రావడంతో ఉపాధ్యాయులు(Teachers) ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. థాంక్యూ సీఎం సార్.. అంటూ రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎల్‌బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎంతో ముఖాముఖి, ఆత్మీయ సమ్మేళనానికి ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లందరూ హాజరయ్యారు.
- ఆనందోత్సవాల్లో ఉపాధ్యాయులు
హైదరాబాద్ సిటీ: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు రావడంతో ఉపాధ్యాయులు(Teachers) ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. థాంక్యూ సీఎం సార్.. అంటూ రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎల్‌బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎంతో ముఖాముఖి, ఆత్మీయ సమ్మేళనానికి ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లందరూ హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనం నేపథ్యంలో ప్రమోషన్లు పొందిన టీచర్లకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. భోజన వసతులు కూడా కల్పించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా తీసుకొచ్చారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఉపాధ్యాయులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ‘నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. గురువులు నేర్పిన విద్యతోనే తాను జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, సీఎంగా అయ్యాను’ అని రేవంత్‌రెడ్డి అనడంతో సభా ప్రాంగణంలో టీచర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీఈటీలు విజిల్స్‌తో హర్షధ్వానాలు పలికారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో పలువురు తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: గోషామహల్‌లో ఉస్మా‘నయా’ ఆస్పత్రి..
అవి వారి మాటల్లోనే..
..........................................................
రిటైర్మెంట్ వరకూ ప్రమోషన్ రాదనుకున్నా..
నాకు 2006 డీఎస్సీలో తెలుగు లాంగ్వేజ్ పండిట్‌గా ఉద్యోగం వచ్చింది. ఎస్‌జీటీ కేడర్‌లో ఉద్యోగం వచ్చినా కొన్నేళ్లుగా హైస్కూల్ పిల్లలకు కూడా బోధిస్తున్నాను. రిటైర్మెంట్ వరకు పదోన్నతి రాదనుకున్నా.
- సత్యనారాయణ, ఎస్‌ఏ తెలుగు, కేసముద్రం స్టేషన్ జెడ్పీస్కూల్, మహబూబాబాద్ జిల్లా
సీఎంకు కృతజ్ఞతలు
20 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూశాను. నా కల ఫలించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్ కల్పించి కొత్త చరిత్ర సృష్టించింది. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు.
- కరుణశ్రీ, జెడ్‌పీహెచ్‌ఎస్ జగిర్యాల్, మెదక్ జిల్లా
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రమోషన్లు కల్పించి మాకు న్యాయం చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
- శోభారాణి, యూపీఎస్ వడ్డెవాట, వనపర్తి జిల్లా
బలోపేతానికి ప్రమోషన్లు దోహదం
విద్యావ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు దోహదపడతాయి. 26 ఏళ్ల సర్వీసులో నాకు ప్రమోషన్ వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
- కాంచనపల్లి శ్రీనివాసాచారి, జెడ్పీహెచ్‌ఎస్ పల్లెపహడ్, యాదాద్రి జిల్లా
బర్త్‌డే రోజునే ప్రమోషన్ వచ్చింది
ప్రమోషన్ల కోసం లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు 10 ఏళ్లకు పైగా పోరాటం చేస్తూనే ఉన్నారు. వందలాది మంది పదోన్నతులు పొందకుండానే రిటైర్ అయ్యారు. నాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని భావించాను. కాంగ్రెస్ ప్రభుత్వం పండిట్లకు ప్రమోషన్లు ఇచ్చి ఆదుకుంది. నాకు నా బర్త్‌డే (జూన్ 19) రోజే ప్రమోషన్ వచ్చింది.
- పవన్, ఎస్‌ఏ తెలుగు, యూపీఎస్,బ్రాహ్మణపల్లి, మహబూబాబాద్ జిల్లా
లాంగ్వేజ్ పండిట్లను విస్మరించింది
లాంగ్వేజ్ పండిట్లను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 30 ఏళ్ల సర్వీసులో ప్రమోషన్ వస్తుందని ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లాంగ్వేజ్ పండితులకు కూడా ప్రమోషన్లు కల్పించి న్యాయం చేసింది.
- టి. బాలాజీ, పీఎస్, మద్రాస్ తండా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు