Share News

Hyderabad: అదనపు కోచ్‌లెక్కడ?

ABN , Publish Date - Aug 27 , 2024 | 08:53 AM

మెట్రోరైళ్లలో(Metro trains) అదనపు కోచ్‌ల అంశమే అడ్రస్‌ లేకుండా పోయింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా 40 నుంచి 50 బోగీలను నాగ్‌పూర్‌(Nagpur) నుంచి తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని గతంలో సూచనప్రాయంగా ప్రకటించిన హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

Hyderabad: అదనపు కోచ్‌లెక్కడ?

- మెట్రోరైళ్లలో బోగీల పెంపుపై నిర్లక్ష్యం

- నాగ్‌పూర్‌ నుంచి తీసుకొస్తామని గతంలో ప్రకటన

- ఇప్పటికీ అందుబాటులోకి రాని వైనం

- నష్టాల సాకుతో పట్టించుకోని ఎల్‌అండ్‌టీ యాజమాన్యం

- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

హైదరాబాద్‌ సిటీ: మెట్రోరైళ్లలో(Metro trains) అదనపు కోచ్‌ల అంశమే అడ్రస్‌ లేకుండా పోయింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా 40 నుంచి 50 బోగీలను నాగ్‌పూర్‌(Nagpur) నుంచి తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని గతంలో సూచనప్రాయంగా ప్రకటించిన హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో నిత్యం వందలాది మంది డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఎల్‌అండ్‌టీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదు.

ఇదికూడా చదవండి: KTR: పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం


ఫలితంగా ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, నాగోలు- రాయదుర్గం కారిడార్లలో ప్యాసింజర్లు ఒకరిపై ఒకరు మీదపడినట్లుగా వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జంట నగరాల పరిధిలో మెట్రో రైళ్ల ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా వినియోగించుకున్న మెట్రోను.. ప్రస్తుతం అన్నివర్గాలూ ఆదరిస్తున్నారు. ట్రాఫిక్‌ నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు.. ఇలా చాలామంది మెట్రోను ఆశ్రయిస్తుండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రైళ్లు కిటకిటలాడుతూనే ఉన్నాయి.


కోచ్‌లపై ఎల్‌అండ్‌టీ సీతకన్ను

నగరంలోని మూడు కారిడార్ల పరిధిలో ప్రస్తుతం 57 రైళ్లు నడుస్తున్నాయి. ఒక్కోరైలుకు మూడు బోగీల చొప్పున 171 కోచ్‌లున్నాయి. ప్రస్తుతం పెరిగిన ప్రయాణికులకు ఈ బోగీలు సరిపోవడం లేదు. ఒక్కో బోగీలో దాదాపు 1500 మందికి పైగా రాకపోకలు సాగిస్తుండడంతో చంటిపిల్లల తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అదనపు కోచ్‌లు తీసుకురావాలని చాలామంది కోరుతున్నప్పటికీ ఎల్‌అండ్‌టీ పట్టించుకోవడం లేదు. కాగా, అదనంగా మరో 40-50 కోచ్‌లను తీసుకొస్తామని గతంలో హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీకి సూచనప్రాయంగా ప్రకటించింది. నాగ్‌పూర్‌ నుంచి కోచ్‌లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పినా.. ఇప్పటివరకు ఆచరణకు నోచుకోవడం లేదు.

city1.2.jpg


ఒక్కో బోగీకి రూ.8 కోట్లు

నగరంలోని ఎల్‌బీనగర్‌-మియాపూర్‌(LBnagar-Miyapur), నాగోల్‌-రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మొత్తం రోజువారీ ప్యాసింజర్లు 4.80 లక్షల్లో, ఈ రెండింటిలోనే 4.30 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారని ఎల్‌అండ్‌టీ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ఈ రెండు కారిడార్లలో కనీసం 40 కోచ్‌లనైనా తీసుకురావాలని గతంలో భావించారు. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక్కో కోచ్‌కు రూ.8 కోట్లు.. 40 కోచ్‌లకు ఏకంగా రూ.320 కోట్లు కావాల్సి ఉండడంతో వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న మూడు కోచ్‌లతోపాటు మరో మూడు బోగీలు నిలిపే విధంగా స్టేషన్లలోని ఫ్లాట్‌ఫారంలు ఉన్నప్పటికీ ఇటు హెచ్‌ఎంఆర్‌, అటు ఎల్‌అండ్‌టీ అధికారులు దీనిపై దృష్టి సారించడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీక్‌ అవర్స్‌తోపాటు పండుగలు, వర్షాలు కురిసిన సమయంలో ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, నాగోల్‌(Uppal, Secunderabad, Nagole), బేగంపేట్‌, అమీర్‌పేట్‌, పెద్దమ్మగుడి, రాయదుర్గం, హైటెక్‌సిటీ, జేఎన్‌టీ యూ, కూకట్‌పల్లి, మియాపూర్‌ లాంటి స్టేషన్లలో రద్దీ విపరీతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.


ప్రత్యామ్నాయ ఆదాయం చూపిస్తేనే..

అదనపు కోచ్‌ల పెంపుపై డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ.. నష్టాల కారణంగా తీసుకొచ్చే పరిస్థితి లేదని ఎల్‌అండ్‌టీ యాజమాన్యం చెబుతోంది. అయితే ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పిస్తే ఆలోచిస్తామని అంటుంన్నారు. కోచ్‌ల విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2024 | 08:55 AM