Share News

Drugs: రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే

ABN , Publish Date - Nov 01 , 2024 | 03:00 PM

Telangana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Drugs: రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే
Shamshabad Airport

హైదరాబాద్, నవంబర్ 1: రాజీవగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి తీసుకువస్తున్న హైడ్రోపోనిక్ గంజాయి ఎయిర్‌పోర్టు అధికారులకు చిక్కింది. బ్యాంకాక్‌ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడికి చెందిన లగేజ్‌‌ను తనిఖీ చేశారు. అయితే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు లగేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే భారీగా డ్రగ్స్ బయటపడింది.

KTR: కేటీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణ వ్యాప్తంగా


అయితే సదరు వ్యక్తి గంజాయిని తరలిస్తున్న విధానాన్ని చూసి అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు. తినే పదార్థం కేలోక్స్‌లో హైడ్రోపోనిక్ గంజాయిని తరలించేందుకు యత్నించాడు ఆ వ్యక్తి. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు కెలోక్స్ ప్యాకెట్లు హైడ్రోపోనిక్ గంజాయి తీసుకువస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాదాపు 13 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్ గంజాయి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత విలువైన ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయిని విమానాశ్రయం సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

drugs-airport.jpg


హైడ్రోపోనిక్ గంజాయి అత్యంత ఖరీదైంది. అలాగే అత్యంత ప్రమాదకరమైనది కూడా. హైడ్రోపోనిక్ గంజాయి తయారు చేయడానికి ఏకంగా సంవత్సర కాలం పడుతుంది. వాటర్ కంటెంట్ లేకుండా చేయడానికి సంవత్సరం సమయం పడుతుంది. హైడ్రోపోనిక్ గంజాయిని నీళ్లలో కలుపుకుని తాగవచ్చు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది తయారవుతుంది. ప్రస్తుతం హైడ్రోపోనిక్ గంజాయిని హైదరాబాద్‌కు తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది.


కాగా... నగరాన్ని డ్రగ్స్ బూతం వీడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలు, రాష్ట్రాల నుంచి సరఫరా అయిన డ్రగ్స్‌ ఇప్పుడు ఏకంగా దేశాలను దాటించి మరీ హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం, పోలీసులు చెప్పినప్పటికీ ఏదో విధంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తునే ఉన్నారు ముఠా సభ్యులు. ఇటీవల దాదాపు రూ.25 లక్షలు విలువల చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడ్లర్‌తో పాటు అంతర్రాష్ట్ర ఫెడ్లర్‌ను కూడా ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. అయితే తరచూ ఇలా డ్రగ్స్‌ పట్టుబడుతుండటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..

Harirama jogaiah: మరో లేఖతో ముందుకొచ్చిన హరిరామజోగయ్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 03:20 PM