Share News

Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ

ABN , Publish Date - Oct 10 , 2024 | 01:09 PM

Telangana: చెరువులకు బతుకమ్మకు అవినాభావ సంబంధం ఉందని.. చెరువులు నిండితేనే మన పంటలు పండుతాయని మంత్రి సీతక్క తెలిపారు. పంటలు పండుతేనే మనం పండుగ చేసుకోగలుగుతామన్నారు. అందుకే అందరమూ చెరువులను కాపాడుకుందామని చెప్పుకొచ్చారు.

Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ
Minister Seethakka

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క (Minister Seethakka). బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, చెరువులను కాపాడుకుందామని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. చెరువులకు బతుకమ్మకు అవినాభావ సంబంధం ఉందని.. చెరువులు నిండితేనే మన పంటలు పండుతాయన్నారు. పంటలు పండుతేనే మనం పండుగ చేసుకోగలుగుతామన్నారు. అందుకే అందరమూ చెరువులను కాపాడుకుందామని చెప్పుకొచ్చారు. బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు.

YS Jagan: హర్యానాపై సరే.. కశ్మీర్‌ సంగతేంది.. జగన్ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారా..


వర్షాకాలం ముగుస్తున్న సమయంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటామని తెలిపారు. చెరువులకు పూజలు చేసే పండుగ బతుకమ్మ అని అన్నారు. చప్పట్లతో ఆడుతూ గొంత్తెత్తి పాడటం వల్ల ఆనందం, ఆరోగ్యం కలుగుతాయన్నారు. ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చి పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. పూలను పూజిస్తూ, చెరువులను ఆరాధిస్తూ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అని మంత్రి సీతక్క వెల్లడించారు.


కేటీఆర్ శుభాకాంక్షలు...

ktr-bathukamma.jpg

తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ పండుగని కేటీఆర్ అన్నారు. పూలను, ప్రకృతిని దేవుళ్లుగా కొలుస్తూ ఆడ బిడ్డలు ఆనందంగా జరుపుకునే అద్భుమైన పండుగన్నారు. దేశంలోనే ఎక్కడ లేని అరుదైన, అందమైన సంస్కృతి వారసత్వం మన బతుకమ్మ పండగ అని గుర్తుచేసుకున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడ బిడ్డలంతా ఎంతో సంతోషంగా ఈ ఘనమైన పండుగను జరుపుకుంటారన్నారు. ఆడబిడ్డల జీవితాల్లో బతుకమ్మ తల్లి మరిన్ని సంతోషాలు, వెలుగు నింపాలని కోరుకుంటున్నాని తెలుపుతూ ఆడబిడ్డలందరికీ కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Bathukamma: బతుకమ్మ వేడుకలకు ఆ ప్రాంతం ముస్తాబు


మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. ఈరోజుతో బతుకమ్మ సంబురాలు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు ట్యాంక్ బండ్ వద్ద కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరుకానున్నారు. బతుకమ్మ సంబరాల నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


ఇవి కూడా చదవండి...

AP Ministers: రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శం.. ఏపీ మంత్రులు

Best Car Color: ఏ రంగు కార్ కొంటే మంచిది.. మెయింటనెన్స్ కూడా తక్కువ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 10 , 2024 | 01:10 PM