TG News: దళిత అధికారి అంబేద్కర్‌పై ఎమ్మెల్యే దుర్భాషలు
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:56 PM
దళిత అధికారి డిప్యూట్ ఇంజినీర్ అంబేద్కర్‌పై రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Makkan Singh Raj Thakur) దుర్భాషలకు దిగాడు. తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న దళిత అధికారి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

ఢిల్లీ: దళిత అధికారి డిప్యూటీ ఇంజినీర్ అంబేద్కర్‌పై రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Makkan Singh Raj Thakur) దుర్భాషలకు దిగాడు. తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న దళిత అధికారి అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన గదిలో నీళ్లు రాలేదన్న కారణంతో అంబేద్కర్‌పై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నాడు. ఢిల్లీలో భారీ వర్షం కారణంగా ఏపీ భవన్ పంప్ హౌస్ మునిగిపోయింది. దీంతో మోటార్లను ఆలస్యంగా సదరు అధికారి ఆన్ చేశాడు.
ట్యాప్‌లో నీళ్లు రాకపోయినా బకెట్‌తో ఎమ్మెల్యే ఠాకూర్‌కు సిబ్బంది నీళ్లు అందించిన.. అధికారిపై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. దళిత ఉద్యోగి పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడంతో మిగతా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేకున్నా స్వర్ణముఖి బ్లాక్‌లో రూమ్ కావాలని ఎమ్మెల్యే బలవంతంగా తీసుకున్నారని, సాధారణ ఎమ్మెల్యేకు గోదావరి బ్లాక్ లోనే అర్హత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన పట్ల సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ భవన్ అధికారులు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి.