MLC Kavita: మాతో పెట్టుకుంటే దబిడి దిబిడే.. వాళ్లకు కవిత మాస్ వార్నింగ్
ABN , Publish Date - Dec 10 , 2024 | 12:20 PM
రేవంత్ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ మహిళా మణులకు గుర్తింపు ఏదని కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్: ఉద్యమకారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెట్టుకోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని మండిపడ్డారు. హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి ప్రజలకు వద్దని అన్నారు. బీద తెలంగాణ తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి అంటున్నారని.. తెలంగాణ ఆడబిడ్డలు ధనవంతులు కావద్దా అని ప్రశ్నించారు. ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదని చెప్పారు. ఉద్యమ కారులతో పెట్టుకోవద్దని కవిత అన్నారు.
ఆ విగ్రహంలో ఏం ప్రత్యేకత..
‘‘ఉద్యమ కాలంలో టీజీ అని ఉంది కాబట్టి రాష్ట్రానికి టీజీ అని పేరు పెట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ కాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారు. తెలంగాణ ఉద్యమంలో అందరూ కలిసి ఉద్యమకాలం నాటి విగ్రహాన్ని పెట్టుకున్నారు. రేవంత్‌రెడ్డి పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉంది. జొన్నలు, మక్కలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పండవా. తెలంగాణలో జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ. బతుకమ్మకు కాంగ్రెస్ హస్తం గుర్తు పెట్టి ఇదే తెలంగాణ తల్లి అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు నజరానా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు విగ్రహాలు పెట్టి పురుషులకు వరాలు ఇస్తున్నారు. బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం ఇతర తెలంగాణ మహిళా మణులకు గుర్తింపు ఏది. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి తెలంగాణ జాతరలు, ఆడబిడ్డల పేర్లు తీయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు కోరుకున్నారు. ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదు’’ అని కవిత పేర్కొన్నారు.
ఆశా వర్కర్లపై దాడిని ఖండించిన ఎమ్మెల్సీ కవిత
ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ‘‘నిన్న ఆశా వర్కర్ల మీదా రేవంత్ ప్రభుత్వం దాష్టికం చేసింది. 100 రోజుల్లో ఆశా వర్కర్లకు గౌరవ వేతనం రూ.18 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏడాది అవుతున్న ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచలేదు. మా హయాంలో ఆశా వర్కర్లను కేసీఆర్ ఇంటికీ పిలిపించి భోజనం పెట్టీ వారికి గౌరవ వేతనం ఇచ్చి గౌరవించుకున్నాం. నిన్న ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ పన్ను తీసేశాం.. మంత్రి నారాయణ కీలక నిర్ణయం
ఈ నీళ్లు తాగితే 5 రోగాలు వెంటనే మాయం..
Read Latest Telangana News And Telugu News