Share News

TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే

ABN , Publish Date - Oct 19 , 2024 | 10:35 AM

Telangana: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై ప్రియురాలి గొంతు కోసేశాడు ప్రేమోన్మాది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని గాయపడిన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే
Murder Attempt in SR nagar

హైదరాబాద్, అక్టోబర్ 19: సమాజంలో ప్రేమోన్మాదులు రాను రాను రెచ్చిపోతున్నారు. అమ్మాయిని ప్రేమించడం.. ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే అఘాయిత్యానికి పాల్పడటం అనేది పరిపాటిగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో పరిచయాలు ప్రేమకు దారి తీస్తున్నాయి. ఎవరో తెలియని వ్యక్తులతో చాటింగ్‌లు చేయడం ఆ తరువాత ఫోన్‌లో సంభాషణలు జరపడం ఆపై ప్రేమ కబుర్లు చెప్పుకోవడం. కానీ ప్రేమిస్తే ఓకే.. ప్రేమ లేదంటే మాత్రం అమ్మాయిని సొంతం చేసుకునేందుకు ఎంత దూరం అయినా వెళ్తుంటారు యువకులు. చివరకు వారి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు ప్రేమోన్మాదులు. మరోవైపు అమ్మాయిలు కూడా మొదట అబ్బాయిలను ఇష్టపడినప్పటికీ ఆ తరువాత వారు ప్రవర్తించే తీరును బట్టి దూరం చేసుకుంటారు. దీంతో ఆగ్రహానికి లోనైన కొంతమంది ప్రేమోన్మాదులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

Viral: తెలంగాణ ఎమ్మెల్యేకు మహిళ నుంచి న్యూడ్ వీడియోకాల్.. ఏవరంటే..?


నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై ప్రియురాలి గొంతు కోసేశాడు ప్రేమోన్మాది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని గాయపడిన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Kadapa: బరితెగించిన రౌడీ మూకలు.. టీడీపీ నేతపై కర్రలు, రాడ్లతో దాడి..


మధుసూధన్ రెడ్డి అనే యువకుడు, యువతి కలిసి అమీర్‌పేట్‌లోని ఓ సంస్థలో ఐటీ శిక్షణ తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఇద్దరు ఆ తరువాత ప్రేమలో పడ్డారు. అయితే మద్యం ఇతర వ్యసనాలకు బానిసవడంతో మధుసూదన్ రెడ్డిని యువతి దూరం పెట్టేసింది. దీంతో యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు.. తనను ప్రేమించి దూరం పెడుతుందనే కోపంతో బ్లేడ్‌తో దాడి చేసి గాయపరచాడు. బ్లేడ్‌తో దాడి చేయడంతో యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే యువకుడు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం యువతికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

Viral Video: ``గడ్డం గీసుకోండి.. ప్రేమలో పడండి``.. షాకిస్తున్న ఇండోర్ కాలేజ్ అమ్మాయిల వింత నిరసన..

Road Accident: అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 10:41 AM