Road Accident: లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Dec 01 , 2024 | 07:52 AM
హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌కై వెళుతున్న దంపతులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్‌లో స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌కై వెళుతున్న దంపతులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా, మోద్కురుకు చెందిన ప్రణయ్‌గా పోలీసులు గుర్తించారు.
మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌కు పోలీసులు డ్రంక్ డ్రైవన్ నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్దారణ అయింది. ఆటో రిక్షాలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన నవ దంపతులు.. దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్‌లుగా పోలీసులు గుర్తించారు. దంపతులు బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం దినేష్ పుట్టినరోజు ఉండడంతో వారు లంగర్ హౌస్‌కు వెళ్ళారు. లంగర్ హౌస్‌లోని యాదవ బస్తీలో మోనా ఠాకూర్ తల్లిదండ్రులు ఉంటున్నారు. రాత్రి లంగర్ హౌస్ నుంచి నందినగర్ కు ద్విచక్ర వాహనంపై దంపతులు బయలుదేరారు. అదే సమయంలో మద్యం మత్తులో వేగంగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన దంపతులిద్దరూ ఘటనా స్థలంలోని మరణించారు. కాగా మొనా టాకుర్ రెండు నెలల గర్భిణి. ఇంటి నుండి బయలుదేరి కిలోమీటర్ దూరం రాగానే ప్రమాదం జరిగింది. నవ దంపతుల మరణ వార్త తెలుసుకొన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీురుగా విలపిస్తున్నారు.
కాగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరికలు చేస్తునే ఉన్నారు. అయినా చాలా మంది పాటించడంలేదు. ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వారి నిర్లక్ష్యానికి చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మైనర్ బాలికలకు వాహనాలు ఇవ్వరాదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
మరోవైపు.. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్‌లో జరిగింది. ప్రమాదవశాత్తు కారు ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఘట్కేసర్ మండలం, మేడిపల్లికి చెందిన బంటు రమేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం చర్లపల్లిలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు ఆయన, భార్య, కూతురు ఆధ్యతో కలిసి హాజరు అయ్యారు. సాయంత్రం చిన్నారి ఆద్య ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ బంధువు కారు రివర్స్ చేస్తుండగా చిన్నారిని ఢీ కొట్టింది. గాయపడిన బాలికను వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్‌చరణ్ కోసం బాలీవుడ్ నటుడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News