Share News

Road Accident: అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే

ABN , Publish Date - Oct 19 , 2024 | 09:39 AM

Telangana: శనివారం ఉదయం ఓ కారు పంజాగుట్ట వైపునకు వస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వ్యక్తి అతివేగంతో కారును నడిపించాడు. ఈ క్రమంలో పంజాగుట్ట వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. మితిమీరిన వేగంతో వాహనం దూసుకురావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది.

Road Accident:  అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే
Road Accident in Hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 19: నగరంలోని పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంతో (Road Accident) ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం ఉదయం ఓ కారు పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Viral: తెలంగాణ ఎమ్మెల్యేకు మహిళ నుంచి న్యూడ్ వీడియోకాల్.. ఏవరంటే..?


పంజాగుట్ట ప్రజాభవన్ పక్కన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఓ కారు పంజాగుట్ట వైపునకు వస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వ్యక్తి అతివేగంతో కారును నడిపించాడు. ఈ క్రమంలో పంజాగుట్ట వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. మితిమీరిన వేగంతో వాహనం దూసుకురావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు వచ్చిన వేగానికి చుట్టుపక్కల వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టడంతో వాహనదారులు భయపడ్డారు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.


ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కున్న యువకులను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయమే ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. ప్రమాదానికి గురైన కారు అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గురైన కారు ఎవరది.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు... మందు సేవించి వాహనం నడుపుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. అతివేగంగా కారు నడపడంపై ఇటు పోలీసులు.. అటు వాహనదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీరు తినే.. బిర్యానీ భద్రమేనా..?



జనగామలోనూ...

మరోవైపు జనగామలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంటలోకి దూసుకెళ్లింది. కారు నేర్చుకుంటుండగా అకస్మాత్తుగా అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో కారులో ప్రయాణిస్తున్న యువకులు బయటపడ్డారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Amaravati Works: అమరావతి పునఃనిర్మాణానికి సీఎం చంద్రబాబు ముందడుగు.. నేడే..

Viral Video: ``గడ్డం గీసుకోండి.. ప్రేమలో పడండి``.. షాకిస్తున్న ఇండోర్ కాలేజ్ అమ్మాయిల వింత నిరసన..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 09:39 PM