Share News

Jubilee Hills: కన్నులపండువగా పెద్దమ్మతల్లి శాకాంబరి ఉత్సవాలు..

ABN , Publish Date - Jul 14 , 2024 | 01:00 PM

జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం(Jubilee Hills Shree Peddamma Mother Temple)లో శాకాంబరి ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేసి అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు.

Jubilee Hills: కన్నులపండువగా పెద్దమ్మతల్లి శాకాంబరి ఉత్సవాలు..

- మొదటి రోజు అమ్మవారికి అభిషేకం

- దర్శనానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం(Jubilee Hills Shree Peddamma Mother Temple)లో శాకాంబరి ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేసి అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, బ్రహ్మాది రుత్విక్‌వేదం, దేవీభాగవతం, చండీ పారాయణం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ కూరగాయలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పూజాధికాల్లో ఆలయ ఫౌండర్‌, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 01:00 PM