Share News

Tourism Development: నాగార్జున సాగర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌: జూపల్లి

ABN , Publish Date - Nov 02 , 2024 | 04:53 AM

నాగార్జున సాగర్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Tourism Development: నాగార్జున సాగర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌: జూపల్లి

నాగార్జునసాగర్‌, హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందులో భాగంగా సాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే, నాగార్జున సాగర్‌, బుద్ధవనంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్టార్‌ హోటళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ మేరకు శ్రీరామచంద్ర మిషన్‌ వ్యవస్థాపకుడు కమలేష్‌ డి పటేల్‌(దాజీ)తో కలిసి శుక్రవారం ఉదయం ఆయన బుద్ధవనాన్ని సందర్శించారు.


విజయవిహార్‌లోని బుద్ధవనంతో పాటు, విజయ విహాల్‌ లే అవుట్లను పరిశీలించారు. వివిధ దేశాల నుంచి బుద్ధవనానికి వచ్చే బౌద్ధులు, పర్యాటకుల కోసం సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. సాగర్‌ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి జూపల్లి.. సాగర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..

Updated Date - Nov 02 , 2024 | 04:53 AM