Share News

ఫ్రీ స్కూల్స్‌గా అంగన్‌ వాడీలు

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:57 AM

పూర్వ ప్రాథమిక విద్యను బలోపే తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. దీనిలో భా గంగానే అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూ ల్స్‌గా) తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఈ మేరకు సూపర్‌వైజర్లకు విద్యా బోధనపై శిక్షణ ఇచ్చారు.

ఫ్రీ స్కూల్స్‌గా అంగన్‌ వాడీలు

జగిత్యాల, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): పూర్వ ప్రాథమిక విద్యను బలోపే తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. దీనిలో భా గంగానే అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూ ల్స్‌గా) తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఈ మేరకు సూపర్‌వైజర్లకు విద్యా బోధనపై శిక్షణ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో సంబంధిత కేంద్రాల టీచర్లకు శిక్షణ ఇ చ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల్లో క్రమశిక్షణతో పాటు తారత మ్యం లేకుండా ఉండేలా యూనిఫాం అమలు చేయనుంది. కాగా స్ర్తీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోనే ఫ్రీస్కూల్స్‌ నిర్వహణ చేపట్టనున్నారు.

జిల్లాలో మొత్తం 1,065 కేంద్రాలు...

జిల్లా వ్యాప్తంగా 1,065 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. జగిత్యాల ఐసీడీ ఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 304 కేంద్రాలు, ధర్మపురి ప్రాజెక్టు పరిధిలో 222, మల్యాల ప్రాజెక్టు పరిధిలో 227 కేంద్రాలు, మెట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో 312 కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలు 12,394 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 34,748 మంది, మూడు నుంచి అయిదేళ్లలోపు లోపు పిల్లలు 13,969 మంది ఉన్నారు.

తొలివిడతగా ఎంపికైన కేంద్రాలు..

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల ను పూర్వ ప్రాధమిక పాఠశాలలుగా ఎంపిక చేశారు. జిల్లాలో 340 కేంద్రా లను ఎంపిక చేశారు. ఇందులో జగిత్యాల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 101 కేంద్రాలు, ధర్మపురిలో 70 కేంద్రాలు, మల్యాలలో 68 కేంద్రాలు, మెట్‌ పల్లిలో 101 కేంద్రాలను ఫ్రీ స్కూల్స్‌గా ఎంపిక చేశారు. వీటిల్లో నిబంధ నల ప్రకారం మార్పులు చేస్తున్నారు. పెయింటింగ్‌తో పాటు ఇతర పను లు చేపడుతున్నారు. మోడల్‌ కేంద్రాల మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు.

సిలబస్‌లో కొంత మార్పు...

ఫ్రీ స్కూల్స్‌కు ఎంపికయిన కేంద్రాలకు సరఫరా చేసిన పుస్తకాల సిల బస్‌లో కూడా కొంత మార్పు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రీస్కూ ల్స్‌ గా మార్పు చేసిన కేంద్రాలకు ఇతర అంగన్‌వాడీ కేంద్రాలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. విజయవంతంగా కొనసాగితే మిగిలిన కేంద్రాలను కూడా విడతల వారీగా మార్పు చేస్తారు. ప్రీ సూళ్లలో చదివే పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా యూనిపాం అందిస్తుంది. డీఆర్‌డీఏకు యూనిఫాం కుట్టు పనులు అప్పగించారు. ఎంపికైన కేంద్రాల్లో మొత్తంగా సుమారు 800 మంది పిల్లలు హజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

విద్యాబోధనలో మార్పులు....

ఇప్పటి వరకు అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా గర్బిణులు, బాలింతలు, పి ల్లలకు పోషకాహారం అందించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆట, పా టలతో విద్యా బోధన చేపడుతున్నారు. అయితే ప్రీ స్కూల్‌లో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలుగా ప్రేరణా త్మక, కృత్యధార బోధన ఉంటుందని అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఆట పాటలు, ప్రకృతి, సైన్స్‌, యోగా, పూర్వగణితం, రంగులు ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో పాటు కృత్యాలతో పిల్లలకు విద్యా బోధన చేస్తారు. నాలుగో శనివారం పూ ర్వ ప్రాథమిక విద్యాదినోత్సవం జరిపి కృత్యాలు, కార్యక్రమాలను ప్రదర్శి స్తారు. పిల్లల్లో వచ్చిన మార్పులు, అభివృద్ధిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు.

శిక్షణకు షెడ్యూల్‌ ఖరారు..

జిల్లాలో ప్రీస్కూల్‌ నిర్వహణ , విద్యాబోధన పై ఈ ఏడాది మార్చిలోనే సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. కాగా ఎంపికైన 340 కేంద్రాల అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్టర్‌ ట్రైనర్లు అయిన సూపర్‌వైజర్ల ద్వారా టీచర్లకు శిక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 21వ తేదీన శిక్షణ తరగతులను ప్రారంభించడానికి షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఒక్కో బ్యాచ్‌లో 35 మంది అంగన్‌ వాడీ టీచర్లకు శిక్షణ ను ఇవ్వనున్నారు. జిల్లాలో 29 బ్యాచ్‌లను ఏర్పాటు చేసి శిక్షణను ఇవ్వడానికి నిర్ణయించారు. అంగన్‌ వాడీ టీచర్లు శిక్షణను పూర్తి చేసుకున్న అనంతరం ఫ్రీ స్కూల్స్‌ నిర్వహణను లక్ష్యం మేరకు చేపట్టడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

అంగన్‌ వాడీ టీచర్లకు శిక్షణకు షెడ్యూల్‌ ఖరారు చేశాము

- వాణి శ్రీ, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి

జిల్లాలో రెండు, మూడు రోజుల్లో శిక్షణ పొందిన సూపర్‌వైజర్ల ద్వారా అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్వ ప్రాథ మిక విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రీస్కూల్స్‌ను ఏర్పా టు చేస్తుంది. సంబంధిత మెటీరియల్‌, కిట్స్‌, పుస్తకాలు, యూనిఫాం అన్ని త్వరలోనే కేంద్రాలకు సరఫరా అవుతాయి.

Updated Date - Jun 19 , 2024 | 12:57 AM