గణిత ఉపాధ్యాయులు దేశ సంపదకు మూలం | Mathematics teachers are the source of wealth of the nation
Share News

గణిత ఉపాధ్యాయులు దేశ సంపదకు మూలం

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:35 AM

ఉపాధ్యాయుల బోధనతోనే ప్రపంచంలోనే మేధావి వర్గం పాలిస్తుందని, గణిత శాస్త్ర ఉపాధ్యాయులే దేశ సంపదకు మూలమని ఎంఈఓ రమేష్‌ అన్నారు.

గణిత ఉపాధ్యాయులు దేశ సంపదకు మూలం

ఓదెల, డిసెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బోధనతోనే ప్రపంచంలోనే మేధావి వర్గం పాలిస్తుందని, గణిత శాస్త్ర ఉపాధ్యాయులే దేశ సంపదకు మూలమని ఎంఈఓ రమేష్‌ అన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా, శనివారం పొత్క పల్లి హైస్కూల్‌లో సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు గణిత మోడల్స్‌ ప్రదర్శన, గణిత రంగోలి, క్విజ్‌, నృత్యాల ప్రదర్శన నిర్వహించారు. పేరెంట్స్‌ , టీచర్స్‌ సమావేశం సందర్భంగా అలాగే ఆహార వారోత్సవాల్లో భాగంగా హాజరైన తల్లిదండ్రులు తీసుకువచ్చిన రుచికరమైన వంటకాలను విద్యార్థులకు వడ్డిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి హెచ్‌ఎం శ్రీనివాస్‌, గణితశాస్త్ర ఉపాధ్యాయులు జైపాల్‌ రెడ్డి, రామకృష్ణ, ఇతర ఉపాధ్యాయులు భద్రయ్య, శ్రీనివాస్‌, రఘుపతి, అమృత కిషోర్‌, రవీందర్‌, పద్మావతి, శ్రీనివాస్‌, రవి పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Dec 22 , 2024 | 01:35 AM