CM Revanth Reddy: నేడు సీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన.. టూర్ షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Aug 15 , 2024 | 07:52 AM
భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ చేసి పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేస్తారు. అనంతరం డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు.
భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri Kothagudem Dist.,) పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు (Sitarama project)కు ప్రారంభోత్సవం చేస్తారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ చేసి పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేస్తారు. అనంతరం డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) పర్యవేక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి టూర్ మినిట్ టూ మినిట్ షెడ్యూల్..
గురువారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.50 గంటలకు పూసుగూడెం చేరుకుంటారు. 12.55 గంటల నుంచి 1.45 గంటల వరకు సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పైలాన్ ఆవిష్కరణ...పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ ఉంటుంది. తర్వాత డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రెస్ మీట్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. 1.45 గంటల నుంచి 2.15 వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. 2.15 గంటలకు అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.45 గంటలకు వైరా చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.30 వరకు వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం సీఎం 4.45 గంటలకు వైరా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్‌ను (Sitarama Project) గురువారం ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ పూజలు చేయనున్నారు. స్వాతంత్య్రదినోత్సవం (Independence Day) సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగరేశాక హెలికాప్టర్ ద్వారా నేరుగా ఖమ్మం జిల్లా వైరాకు చేరుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌లను ప్రారంభించిన అనంతరం అక్కడే భోజనాలు చేసుకుని వైరాలో జరుగనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
కాగా... రెండు రోజుల క్రితం సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈనెల 11న పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్ల వద్ద మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్-2 ట్రయల్ రన్‌ను మంత్రులు ప్రారంభించారు.