Share News

Harishrao: సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను: మాజీ మంత్రి హరీష్ రావు

ABN , Publish Date - Sep 27 , 2024 | 01:48 PM

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని, సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంటే.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చారని అన్నారు.

Harishrao: సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను: మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ధర్నా (Protest) చేపట్టారు. రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఇచ్చిన హామీలు (Guarantees) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా లో మాజీ మంత్రి హరీష్ రావు (Ex Minister Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..


హరీష్‌రావు కామెంట్స్.. (Harish Rao Comments)

* రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు నేను నిద్రపోను, రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను.

* రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదు.

* కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంది.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు.

* కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వచ్చింది.. ఇప్ప్పుడు ఎందుకు వస్తలేదు..

* కరోనా సమయంలోనూ రైతు బంధు టైంకు ఇచ్చినం.

* వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు.. కోతలు కొస్తున్నా రైతు బందు రావడం లేదు.

* రేవంత్ రేడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి..

* ఈ వానాకాలం రూ. 7,500 లేదు.. గతంలో ఇచ్చిన రూ. 5 వేలు లేదు.

* రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని అప్పుల పాలు చేస్తున్నారు.

* కుంటిసాకులు, అబద్దాలతో కాలం గడుపుతున్నారు.

* కేసీఆర్ 11 సార్లు టైంకు రైతు బంధు ఇచ్చిండు... వడ్లు కొంటే మూడు రోజుల్లో పైసలు వేసిండు..

* రైతు విలువ, రైతు భూమి విలువ పెంచిండు..

* కాంగ్రెస్ వచ్చింది.. రైతు విలువ తగ్గింది.. భూమి విలువ తగ్గింది..

* కాళేశ్వరం కూలిపోయింది అంటున్న రేవంత్ రెడ్డి వచ్చి రంగనాయకసాగర్, మాల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ చూడాలి.

* కాళేశ్వరంలో వంద బాగాలు ఉంటాయి.. అందులో ఒక్క భాగంలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు..

* కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినంక రెండు పంటలు రైతులు పండిస్తున్నారు.

* రెండు లక్షల మాఫీ, వడ్లకు బోనస్ అన్నారు.. వచ్చిందా...

* ఇప్పుడు సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

* ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అని, ఇప్పుడు సన్నాలు అంటున్నారు..

* రైతుమాఫీపై తొలి సంతకం అన్నావు.

* రుణమాఫీ పూర్తిగా చేస్తే రాజీనామా చేస్తా అన్నా.. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు మేలు జరగడం నాకు సంతోషం అన్నా...

* సవాల్‌కు సై అన్నారు.. 15 ఆగస్టుకు మాఫీ చేస్తే ఇంత మంది వచ్చేవారా..

* రూ. 31 వేళ కోట్ల నుంచి రూ.18 వేళ కోట్లకు వచ్చింది..

* రుణమాఫీ అయింది తక్కువ, కానోళ్ళూ ఎక్కువ...

* ఎడుపన్నావు హరీష్ అంటే, నీ గుండెల్లో ఉన్నా అని చెప్పిన..

* రుణమాఫీ అయ్యేదాకా నీ వెంట పడత..

* హైదారాబాద్‌లో కూర్చుని మస్తు మాటలు చెబుతున్నరు.

* ఎనుముల రేవంత్ రెడ్డి.. ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారు.

* పండగ లోపు రుణమాఫీ చేయకుంటే రైతులంతా హైదారాబాద్‌కు వచ్చి సెక్రటేరియట్ ముట్టడిస్తామని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

జగన్‌కు వ్యతిరేకంగా తిరుమలలో నిరసనలు..

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. సీఎం నివాళులు

హైడ్రను అడ్డుకున్న మూసీ నివాసితులు..

కడియపులంక నర్సరీల్లో సంచరిస్తున్న చిరుత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 27 , 2024 | 01:50 PM