MLA: హైడ్రా కూల్చివేతలు అన్యాయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 29 , 2024 | 12:51 PM
మూసీ సుందరీకరణ పేరుతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో హైడ్రా పేదల ఇళ్లను కూలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్(MLA Kaleru Venkatesh) అన్నారు.
హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో హైడ్రా పేదల ఇళ్లను కూలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్(MLA Kaleru Venkatesh) అన్నారు. శనివారం గోల్నాక డివిజన్ తులసీరాంనగర్(లంక)లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యటించి మూసీ పరీవాహక ప్రాంత బాధితులకు ధైర్యం చెప్పారు. బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యేకు బాధితులు తమ ఆవేదనను, బాధను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఇళ్లను కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి: Collector: అధైర్యపడొద్దు.. ఇళ్లు ఇస్తాం..
పేదలు, మధ్య తరగతి ప్రజలు నిర్మంచుకున్న నివాసాలపై ప్రతాపం చూపడం మానుకోవాలని ఇది సరైన పనికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా(Hydra) పేరుతో సామాన్య ప్రజలలో భయాందోళన సృష్టించడం పట్ల ఆయన మండిపడ్డారు. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్(BRS) నాయకులు పాకచందర్, పులిజాల గెల్వయ్య, దోర్నాల భరత్‌రాజ్‌ముదిరాజ్, కాలేరు రామకృష్ణ, బి.నర్సింగ్‌రావుయాదవ్, రెడపాకరాము, ఎ.సురేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, పడకంటి అంజయ్య, ప్రభాకర్‌ముదిరాజ్, ఆర్.దేవేందర్, బక్కయ్య, కిషన్‌సింగ్, యూసూప్, రాజ్యలక్ష్మి, మారుతి పాల్గొన్నారు.
..........................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................................
Hyderabad: ఇళ్ల కూల్చివేతలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: బీజేపీ
హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు(Dr. N. Gautam Rao) డిమాండ్ చేశారు. బర్కత్‌పురాలోని నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు కూల్చివేస్తామని మార్కింగ్ చేస్తుండటంతో నిరుపేదలు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారని అన్నారు.
ఇళ్ల కూల్చివేతపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పార్టీల సూచనలను సలహాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూసీసుందరీకరణపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి రూట్ మ్యాప్‌నూ ప్రకటించలేదని విధివిధానాలను రూపొందించలేదని దీనివల్ల ప్రజలు తీవ్రభయాందోళన కు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల కూల్చివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని, పేదలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లు కూల్చితే బీజేపీ ఉద్యమిస్తుందని బాధితులకు అండగా నిలస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: BRS.. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలి: హరీష్ రావు
ఇదికూడా చదవండి: BRS: హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ నేతలు..
ఇదికూడా చదవండి: గచ్చిబౌలి స్టేడియంలో ‘పింక్ పవర్ రన్ 2024’
ఇదికూడా చదవండి: Khammam: రెండు రేషన్ కార్డులపై ఇంటెలిజెన్స్ విచారణ
Read Latest Telangana News and National News